GVL Narasimha Rao : ప్రకాశం జిల్లాను వదిలేశారు, ఏపీ ప్రభుత్వంపై జీవీఎల్ విమర్శలు

జగన్ ప్రభుత్వం ప్రకాశం జిల్లాను విస్మరించిందని జీవీఎల్ అన్నారు. ప్రకాశం జిల్లా వాళ్లకు రాజకీయ హోదా ఎందుకు దక్కలేదో అర్ధం కావడం లేదన్నారాయన. వెలిగొండ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కావడం

GVL Narasimha Rao : ప్రకాశం జిల్లాను వదిలేశారు, ఏపీ ప్రభుత్వంపై జీవీఎల్ విమర్శలు

Gvl Narasimha Rao

GVL Narasimha Rao : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం ప్రకాశం జిల్లాను విస్మరించిందని జీవీఎల్ అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలనే ప్రకాశం జిల్లాలో ఎంపీలుగా ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా వాళ్లకు రాజకీయ హోదా ఎందుకు దక్కలేదో అర్ధం కావడం లేదన్నారాయన. దశాబ్దాల కాలం గడుస్తున్నా వెలిగొండ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో రేపు మాపు అంటూ టీడీపీ, వైసీపీలు కాలయాపన చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రాజెక్ట్ నిర్మించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్రాన్ని విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ ఎంపీలపైనా జీవీఎల్ ధ్వజమెత్తారు. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధిపై మీరు ఎప్పుడైనా మీ సీఎంను కలిశారా..? కనీసం అపాయింట్ మెంట్ అయినా దొరికిందా? అని ఏపీ ఎంపీలను ప్రశ్నించారు. ఇప్పటివరకూ ప్రజల కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతమైనప్పటికి గుర్తింపు మాత్రం రావడం లేదని ఆయన వాపోయారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో మేము కూడా ఇందుకోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని జిల్లాగా చేసి రోడ్ కనెక్టివిటీ పెంచాలని సూచించారు జీవీఎల్.

Chandrababu : వైసీపీ అధికారంలోకి వస్తే చీకటి రాజ్యం వస్తుందని ఆనాడే చెప్పా-చంద్రబాబు

కేంద్ర గ్రాంట్ల విషయంలో రాష్ట్రం చెల్లించాల్సిన వాటా చెల్లించడం లేదన్నారు జీవీఎల్. మార్చి 31 నాటికి చెల్లించకపోతే ఆ నిధులు మురిగిపోయే అవకాశం ఉందన్నారు. వెలిగొండ నీటి ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇంతవరకు సమర్పించ లేదన్నారు. డీపీఆర్ సమర్పించకపోతే ఆ ప్రాజెక్టు మనుగడ కష్టతరమవుతుందన్నారు.

ఏపీ ప్రత్యేక హోదా అంశంపైనా జీవీఎల్ స్పందించారు. 2014 వరకు ప్రత్యేక హోదా అంశం ఉండేదని.. ఆ తర్వాత దాని ప్రస్తావన లేదని స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా నిధులు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
ఇతర రాష్ట్రాలు కూడా స్పెషల్ స్టేటస్ ను డిమాండ్ చేస్తున్నందు వల్ల ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏపీకి ఇచ్చామని వివరించారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తనవంతు ప్రయత్నం చేస్తే.. మేము కూడా మా ప్రయత్నం చేస్తామని జీవీఎల్ చెప్పారు. రెవిన్యూ డెఫిషిట్ గ్రాంట్ ఏపీకి ఎప్పటికప్పుడు ఇస్తున్నామని జీవీఎల్ తెలిపారు. ఏపీ అభివృద్ధిపై నిరంతరం శ్రద్ధ వహిస్తున్నామని వెల్లడించారు.

Pawan Kalyan : గౌతమ్ సవాంగ్‌ని ఎందుకు తప్పించారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్

కేంద్ర వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్పించేందుకు వెనుకబడిన జిల్లాల జాబితాను ప్రభుత్వం త్వరగా పంపాలని జీవీఎల్ సూచించారు. ఇక ఏపీలో జిల్లాకో ఎయిర్ పోర్టు పెడతామన్న ప్రతిపాదనను స్వాగతించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఎక్కువ జిల్లాలు ఉండటం మంచిదే అని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.