CBI ready to arrest punch prabhakar : పంచ్ ప్రభాకర్ కు ‘పంచ్’..అరెస్ట్ కు రంగం సిద్ధం

‘పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కు రంగ సిద్ధమైంది. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసు లో పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది.

CBI ready to arrest punch prabhakar : పంచ్ ప్రభాకర్ కు ‘పంచ్’..అరెస్ట్ కు రంగం సిద్ధం

Cbi Ready To Arrest Punch Prabhakar

CBI ready to arrest punch prabhakar reddy : ‘పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కు రంగ సిద్ధమైంది. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసు లో సి.బి.ఐ తాజా అఫిడవిట్ దాఖలు అయ్యింది. దీన్ని సీబీఐ డైకెర్టర్ జైస్వాల్ హైకోర్టులో దాఖలు చేశారు.ఇప్పటికే అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న పాకీ ప్రభాకర్ రెడ్డికి సీబీఐ బ్లూ నోటీసును జారీ చేసింది. ఇంట్రపోల్ సహాయంతో అరెస్ట్ కు అడుగు దూరంలో ఉంది సిబీఐ. ఇక అరెస్ట్ అనివార్యం.

రాజ్యాంగం, చట్టంతో నాకేం పని అన్నట్లుగా పంచ్ ప్రభాక్ పోస్టులు పెటట్టం..న్యాయస్థానాలు అంటే లెక్కలేదు. న్యాయమూర్తులు అంటే గౌవరం లేదు. ఐ డొంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించే పంచ్ ప్రభాకర్ కు పంచ్ పడింది.అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. పంచ్ ప్రభాకర్ అంటే పెద్ద తోపుని అనుకుంటాడో ఏమో.. రాష్ట్రపతి, సుప్రీం చీఫ్ జస్టిస్, లోక్ సభ స్పీకర్ ఇలా అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్నవారిని కూడా దారుణంగా మాట్లాడుతుంటాడు. వీరంతా ఆతగాడి దృష్టిలో నాన్‎సెన్స్ కింద లెక్కగా అన్నట్లే. చిన్నపెద్ద తేడా లేదు. గౌరవం అనే పదానికి అర్థమే తెలీదు ఇతగాడికి.

Read more : Varla Ramaiah : జూ.ఎన్టీఆర్ సంబంధం లేకపోతే సినిమా ప్రయత్నాలు ఎందుకు?

ఈ ప్రభాకర్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి బూతులు..బండ బూతులు. కారులో తిరుగుతూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుంటాడు. నోటికి ఎంత వస్తే అంతే. వారెవరైనా ఐడోంట్ కేర్ అంటాడు. సోషల్ మీడియాలో బూతుల దండకం ప్రవాహంలా సాగిస్తుంటాడు. న్యాయమూర్తులను, న్యాయస్థానాలను కించపర్చేలా హేళన చేస్తూ బూతులు ప్రవాహాన్ని పారిస్తాడు.ఇతను ఆఖరికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడువారిని కూడా వదల్లేదు. తనదైన శైలిలో తిడుతుంటాడు. దీంతో ఢిల్లీ లో రెండు సెక్షన్ల కిందా కేసు, ఏపీ హైకోర్టు డైరెక్షన్లో మరో కేసు .. ఇలా కేసులపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు ను సీబీఐకి అప్పగించింది. అమెరికాలో ఉన్నాను .. నన్నే ఏం చేస్తారని అనుకునే పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది.

న్యాయమూర్తులను కించపరిచే విధంగా పదే పదే వీడియోలు పెడుతున్న పంచ్ ప్రభాకర్ కోసం నవంబర్ 1న లుక్ఔట్ సర్క్యులర్ హోం మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేశామని సి.బి.ఐ పేర్కొంది. ఇంటర్ పోల్ లో జారీచేసిన బ్లూ నోటీసు ద్వారా అమెరికాలోని ఎఫ్ బి ఐ( ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అతని చిరునామాను పంపిందని సి.బి.ఐ వెల్లడించింది. నవంబరు 8వ తేదీన పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ సంబంధిత కోర్టు నుంచి తీసుకుంది సి.బి.ఐ. నవంబర్ 9న ఇంటర్ పోల్ కు పంచ్ ప్రభాకర్ అరెస్టు రిక్వెస్ట్ ను పంపిన సి.బి.ఐ ప్రభాకర్ అరెస్ట్ కు సంబంధించి ఇంటర్పోల్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది సీబీఐ.

Readmore : Kadapa floods : కడపలో వరద బీభత్సం..వారంతా ఎక్కడున్నారు ? బతికి ఉన్నారా..లేరా

Punch prabhakar తాజా వీడియో లపై నవంబర్ 15న యూట్యూబ్ ఛానల్ తో సిబిఐ అధికారులు వర్చువల్ గా సమావేశమయ్యారు. పంచ్ ప్రభాకర్ యూట్యూబ్ ఛానల్స్ మొత్తాన్ని తొలగించాలని సి.బి.ఐ యూట్యూబ్ ను కోరింది.
ఈ కేసులో సంబంధం ఉన్న మిగతా వారందర్నీ విచారిస్తున్నామని..ఈ కేసులో 17వ నిందితుడిగా punch prabhakar పేరును చేర్చామని సి.బి.ఐ వెల్లడించింది. న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థలను కించపర్చేలా తన యూట్యూబ్ చానెల్లో అసభ్యక పోస్టుల పెట్టే పంచ్ ప్రభాకర్ ను పట్టుకునేందు సీబీఐ రంగం సిద్ధం చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా 53 మొబైల్ నంబర్ల కాల్ డిటేయిల్స్ ను సేకరించింది. ఏపి న్యాయమూర్తులపైనా, హైకోర్టు పై సోషల్ మీడియాలో పంచ్ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యాలు, పోస్టులపై ఇంచార్జి రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) దాఖలు చేసిన వ్యాజ్యంపై సంగతి తెలిసిందే.

దర్యాప్తు చేస్తున్న సీబీఐకి హైకోర్టు ధర్మాసనం గతంలో బుర్రవాచిపోయేలా వార్నింగ్ కూడా ఇచ్చింది. అరెస్ట్ చేయలేకపోతే చెప్పండి.. సిట్ ఏర్పాటుచేసి ఎలా అరెస్ట్ చేసి తీసుకురావాలో మాకు తెలుసని హెచ్చరించింది. నవంబర్ 22 వాయిదా సమయానికి పంచ్ ను పట్టుకోకుంటే సీబీఐ డైరెక్టర్ ను కోర్టు పిలిచి, తరువాత ప్రొసిజర్ ప్రకారం సిట్ ఏర్పాటు చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం నవంబరు 3న పేర్కొన్న విషయం తెలిసిందే. ఈక్రమంలో సీబీఐ పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కు అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసింది. పంచ్ ప్రభాకర్ కు సీబీఐ పంచ్ పడింది. ఇక చూడాలి ఈ నోటిదురుసు ఆగుతుందో లేదో..