Chandrababu: దొంగ సారా, కల్తీ సారా వ్యాపారం చేస్తున్నది వైసీపీ నాయకులే: చంద్రబాబు

కల్తీ సారా మరణాలను సాధారణ మరణాలుగా చూపిస్తూ వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసుస్తుందని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandrababu: దొంగ సారా, కల్తీ సారా వ్యాపారం చేస్తున్నది వైసీపీ నాయకులే: చంద్రబాబు

Babu

Chandrababu: కల్తీ సారా మరణాలను సాధారణ మరణాలుగా చూపిస్తూ వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకున్న కల్తీ సారా మృతుల బాధిత కుటుంబాలను సోమవారం చంద్రబాబు పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ సారా కారణంగా అమాయక ప్రజలు మృతి చెందితే.. వైసీపీ నేతలు సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడుతుంటే సీఎం జగన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నాడని చంద్రబాబు అన్నారు.

Also read: Covid Vaccine Children : మార్చి16 నుండి 12-15 ఏళ్ళ పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్

ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పేద వాళ్ళను పీల్చుకుతింటున్నాడని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక కొత్త కొత్త బ్రాండులు తీసుకువచ్చి రేట్లు విపరీతంగా పెంచాడని.. దీంతో మద్యం సేవించే వారి సంఖ్య పెరగడంతో పాటు పేదవారు కల్తీ సారాకు బలైపోతున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో దొంగ సారా, కల్తీ సారా వ్యాపారం చేస్తున్నది వైసీపీ నాయకులేనన్న చంద్రబాబు.. కల్తీ సారా కారణంగా 26 మంది చనిపోవడానికి జగన్ రెడ్డే కారణమని ఆరోపించారు.

Also read: CPI Meetings: ఢిల్లీలో మూడు రోజుల పాటు సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు

జంగారెడ్డి గూడెం కల్తీ సారా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా, ఈ రాష్ట్రంలో కల్తీ సారాను అరికట్టి..భాద్యులను జైళ్లలో పెట్టే వరకు పోరాడతానాని చంద్రబాబు నాయడు పేర్కొన్నారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పునా టీడీపీ తరపున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు చంద్రబాబు. బాధిత కుటుంబాలను ఆదుకునేలా జగన్.. ఒక్కొక్కరికి 25 లక్షలు రూపాయిలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ప్రభుత్వం ఇచ్చిందని అది ప్రైవేటు ఫ్యాక్టరీ అయినా ప్రభుత్వం తరుపున ఎక్స్ గ్రేషియా ఇచ్చారని.. ఇప్పుడు జంగారెడ్డి గూడెం బాధితులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ రూ.25 లక్షలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే తాము అధికారంలోకి వచ్చాక 25 లక్షలు రూపాయిలు ఇచ్చే బాధ్యత నాది అంటూ చంద్రబాబు తెలిపారు.

Also read: Brother Anil Kumar: క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో బ్రదర్ అనిల్ సమావేశం

ఇక వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలపై చంద్రబాబు స్పందిస్తూ..”ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన నా అనుభవం అంత వయసు కూడా లేని జగన్ కు నన్ను విమర్శించే హక్కు లేదని” అన్నారు. “నన్ను విమర్శిచే హక్కు నీ పెంపుడు కుక్కలకు లేదు.. వాళ్లకు ఒకముక్క వేస్తే నన్ను విమర్శిస్తారు, జగన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు జైళ్లకు పోయారు..ఇప్పుడు జరిగే అవినీతికి ఎంత మంది జైళ్లకు పోతారో తెలీదు” అంటూ జగన్ పై చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. సీఎం సొంత బాబాయ్ హత్య కేసుపై ఆనాడు జగన్ ఏమి చెప్పాడో గుర్తు చేసుకోవాలన్న చంద్రబాబు..సొంత చెల్లెలైన సునీతను మాయమాటలు చెప్పి మోసం చేసాడని చంద్రబాబు విమర్శించారు.