Ongole Drugs : చెన్నైలో తీగలాగితే ఒంగోలులో బయటపడ్డ డ్రగ్స్ బాగోతం

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తున నిషేధిత డ్రగ్స్ ను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  చెన్నై నుంచి ముడి సరుకును తెప్పించి ఒంగోలులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వాట

Ongole Drugs : చెన్నైలో తీగలాగితే ఒంగోలులో బయటపడ్డ డ్రగ్స్ బాగోతం

Ongole Drugs

Ongole Drugs : ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తున నిషేధిత డ్రగ్స్ ను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  చెన్నై నుంచి ముడి సరుకును తెప్పించి ఒంగోలులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వాటిని రీప్యాక్ చేసి వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది.

చెన్నై పోలీసుల దాడిచేసి మత్తు పదార్ధాలు స్వాధీనం చేసుకుని తయారీ కేంద్రాన్ని సీజ్ చేసారు. ఆరు రోజుల క్రితం చెన్నైలో నిషేధిత డ్రగ్స్ ఉపయోగిస్తున్న నలుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారికి ఈ  డ్రగ్స్  ఎక్కడి నుంచి వచ్చాయి ?  ఎవరు సరఫరా చేసారు ? అనే కోణంలో విచారించగా అవి ఒంగోలు నుంచి వచ్చినట్లు వాళ్లు తెలిపారు.
Also Read : TS Covid Update : తెలంగాణలో కొత్తగా 91 మంది కోవిడ్ కేసులు నమోదు
దీంతో పోలీసులు  హుటా హుటిన ఒంగోలులో ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని గోడౌన్ వద్దకు వెళ్లి  తనిఖీ చేయగా మత్తు పదార్ధాలు తయారు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దీని మూలాలు హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకు కూడా ప్రత్యేక బృందాలు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు గోడౌన్ లో మత్తుపదార్ధాలు స్వాధీనం చేసుకని గోడౌన్ సీజ్ చేశారు.