Krishna Godavari Rivers : కృష్ణ, గోదావరి యాజమాన్యాల బోర్డులకు చీఫ్ ఇంజనీర్ల నియామకం

కృష్ణా, గోదావరి యాజమాన్యాల బోర్డులకు చీఫ్‌ ఇంజనీర్లను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  ఒక్కో బోర్డుకు ఇద్దరు ఇంజనీర్లను నియమించింది.

Krishna Godavari Rivers : కృష్ణ, గోదావరి యాజమాన్యాల బోర్డులకు చీఫ్ ఇంజనీర్ల నియామకం

Krmb Chief Engineers

Updated On : September 13, 2021 / 4:22 PM IST

Krishna Godavari Rivers : కృష్ణా, గోదావరి యాజమాన్యాల బోర్డులకు చీఫ్‌ ఇంజనీర్లను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  ఒక్కో బోర్డుకు ఇద్దరు ఇంజనీర్లను నియమించింది. కేఆర్‌ఎంబీ చీఫ్ ఇంజనీర్లగా టీకె శివరాజన్, అనుపమ్‌ ప్రసాద్‌లను నియమించింది. ప్రస్తుతం వీరిద్దరూ గ్రేడ్ ఏ ఆఫీసర్లుగా సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో సేవలు అందిస్తున్నారు. జీఆర్‌ఎంబీ చీఫ్‌ ఇంజనీర్‌గా ఎంకె సిన్హా, జీకే అగర్వాల్ విధులు నిర్వహించనున్నారు. వీరు కూడా గ్రేడ్ ఏ ఆఫీసర్లు గా పని చేస్తున్నారు.

Read Also : Ganesh Nimajjanam: హుస్సేన్ సాగర్ గణేశ్ నిమజ్జన అనుమతి పిటిషన్ కొట్టిపారేసిన హైకోర్టు

బోర్డుల చైర్మన్‌కు చీఫ్ ఇంజనీర్లు రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అక్టోబరు 14 నుంచి బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తాయని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి సారించాలని ఇంజనీర్లను కోరింది.  గెజిట్ నోటిఫికేషన్‌ అమలుపై సమావేశానికి ముందే ఉత్తర్వులు వెలువడ్డాయి.

Read Also : Extra Marital Affair : అక్రమ సంబంధం తెలిసిందని..ప్రియుడితో కలిసి మామను చంపిన కోడలు

వీరు ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, విద్యుదుత్పత్తి, వంటి  అనేక అంశాలను ఎప్పటి కప్పుడు బోర్డు చైర్మన్లకు వివరించాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో, రెండు నదులపై ఉన్న108 ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలు వీరి ప్రధాన కర్తవ్యంగా ఉంటుందని కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కోంది.