Andhra Pradesh: ఈ-స్టాంపింగ్ సేవలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఎస్‌బీఐ, ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్‌సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 లకు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది, మరొక 1000కి పైగా కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

AP CM Jagan
Andhra Pradesh: రిజిస్ట్రేషన్ శాఖలో ఈ-స్టాంపింగ్ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. అనంతరం దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ విధానం సురక్షితమైనది, భద్రతగలది, ఎలాంటి సాంకేతిక సమస్యలు లేనిది. shcilestamp.com వెబ్‌సైట్ ద్వారా ఈ–స్టాంపింగ్ మొబైల్ యాప్ ద్వారా ఈ–స్టాంపులు ఆన్‌లైన్‌లో ధృవీకరించుకోవచ్చు. నగదు, చెక్కు, ఆన్‌లైన్ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్, యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు’’ అని అన్నారు.
AP CM Jagan : ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలి : సీఎం జగన్
ఎస్‌బీఐ, ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్‌సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 లకు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. మరొక 1000కి పైగా కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 లకు పైగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద ఈ–స్టాంపింగ్ ద్వారా స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను చెల్లించవచ్చు. స్టాంప్, రిజిస్ట్రేషన్ శాఖ సెంట్రల్ రికార్డు నిర్వహించే ఏజెన్సీ అయిన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏపీ ప్రభుత్వం అందిస్తున్న మరొక ప్రజాహితమైన కార్యక్రమం ఇదని ప్రభుత్వం ఒక ప్రటనలో పేర్కొంది.
Karnataka Election 2023 : కర్ణాటకలో మోదీ ఎన్నిక ప్రచారాలు .. 20 బహిరంగ సభల్లో ప్రసంగాలు