Chandrababu Kuppam Tour : తమ్ముళ్లను దారిలోకి తేవటానికి చంద్రబాబు కుప్పం టూర్

కుప్పం టీడీపీలో తమ్ముళ్ల మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. నేతలతోను..కార్యకర్తలతోను సమావేశమైన పలు కీలక విషయాలు చర్చించనున్నారు.

Chandrababu Kuppam Tour : తమ్ముళ్లను దారిలోకి తేవటానికి చంద్రబాబు కుప్పం టూర్

Chandrababu Kuppam Tour

Chandrababu Kuppam Tour : చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు కంచుకోట అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.అటువంటి కుప్పంలో ఇటీవల కాలంలో పరిస్థితులు మారుతున్నాయి. కుప్పం టీడీపీలో తమ్ముళ్ల మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో వాటిని ఆరంభంలోనే అణచివేయాలను చంద్రబాబు నిర్ణయించారు. దీంట్లో భాగంగానే కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. టీడీపీ నేతలతో సమావేశం అయ్యి పలు కీలక విషయాలు చర్చించి విభేధాలను తొలగించాలనే ఉద్ధేశ్యంతో మూడు రోజుల పాటు కుప్పంలోనే పాగా వేసి పరిస్థితులు చక్కబెట్టనున్నారు. టూర్ లో భాగంగా అక్టోబర్ 12,13,14 తేదీల్లో చంద్రబాబు కుప్పం నియోజకర్గంలో పర్యటించనున్నారు.

కాగా..కుప్పం అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే కుప్పం అన్నట్లుగా ఉండేది. చంద్రబాబు నాయుడు కుప్పం కంచుకోట. కుప్పంలో చంద్రబాబు చెప్పిందే మాట. చేసిందే శాసనంగా ఉండేది. కుప్పం నుంచే ఆయన గెలుపు కొనసాగుతోంది. ఓటమెరుగని చంద్రబాబు 1989 నుంచి 2019 ఎన్నికల వరకు వరుస విజయాలతో కుప్పం దూసుకెళ్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కుప్పంలో చంద్రబాబు అఖండ మెజారిటీతో గెలుపొందుతునే ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు మాటంటే తమ్ముళ్లకు వేదం.కానీ మార్పు సహజమే అన్నట్లుగా చంద్రబాబుకు పులిమీద పుట్రలలాగా కుప్పంలో తమ్ముళ్ల మధ్య విబేధాలు రావటం బాబుకు తలనొప్పిగా మారింది. 2019 ఎన్నికల అనంతరం కుప్పంలో క్రమంగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ఎలాంటి ఎన్నికలైనా కుప్పంలో టీడీపీదే పైచేయిగా ఉండే క్రమంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వైసీపీ చంద్రబాబు కంచుకోటలో వేళ్లూనుకోవానికి యత్నిస్తోంది. టీడీపీ కార్యకర్తల్ని లోబరుచుకుని చంద్రబాబుని దెబ్బకొట్టాలనుకుంటోంది. దీని కోసం పలు రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు.

Read more :Chandrababu : రెండున్నరేళ్లలో అభివృద్ధి జాడేలేదు,ఏపీలో ఎక్కడ చూసినా విధ్వసం,రాక్షస పాలనే: చంద్రబాబు 

దీంట్లో భాగంగానే పంచాయితీ ఎన్నికల నుంచి ఎంపీపీ ఎన్నికల కుప్పంలో టీడీపీకి ఘోరమైన ఓటమి పాలైంది. ఇది టీడీపీకి కాస్త గట్టిదెబ్బ అనే చెప్పాలి. పార్టీ పోటీలో ఉన్న లేకున్నా టీడీపీ బలపరిచిన అభ్యర్థినే అధిక శాతం గెలిపించుకోవడం కుప్పం ప్రజల ఆనవాయితీ. కానీ గత రెండున్నరేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీనికితోడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య తలెత్తిన విభేదాలను వైసీపీ ఉపయోగించుకోవటానికి యత్నిస్తోంది. ఇటువంటి పరిస్థితులు టీడీపీకి ఇబ్బందిగా మారాయి.ఈక్రమంలో 2021లో పంచాయితీ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు కుప్పంపై ఫోకస్ పెట్టారు. అలా మూడు రోజుల కుప్పంలో పర్యటించారు. ఆ పర్యటనలో చంద్రబాబు కార్యకర్తలపై కాస్త అసంతృప్తి వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రసంగంలో పార్టీ అధికారంలో లేనంత మాత్రాన మీరిలా చేయటం సరికాదని కాస్త ఘాటుగానే క్లాస్ పీకారు. దీంతో చంద్రబాబు ముందు ఎవ్వరు నోరెత్తలేదు.కానీ అంతర్గతంగా కొంతమందిలో మార్పులు వచ్చాయి. కార్యకర్తలు చంద్రబాబు ముందు నోరెత్తకుండా సైలెంట్ గా ఉన్నా లోలోపల మాతం బాబుగారి మాటలు జీర్ణించుకోలేక పోతున్నారని సమాచారం.

కుప్పంలో చంద్రబాబు లేకపోయినా అక్కడి పరిస్థితుల్ని.. పార్టీ వ్యవహారాల్ని మనోహర్, ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు చూసుకుంటారు. దీంతో పార్టీకి నష్టమేమీ లేదని అధిష్టానం భావిస్తోంది. కానీ వీరికి కార్యకర్తలకు పెద్దగా పొసగటంలేదని టాక్. మనోహర్ ను పార్టీ నుంచి తొలగించాలని కార్యకర్తల డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. కానీ చంద్రబాబు మనోహర్ ను తొలగించటానికి ఇష్టపడటంలేదట. వారిని మార్చే ప్రసక్తే లేదని చంద్రబాబు కార్యకర్తలకు తేల్చి చెప్పినట్లుగాను..దీంతో తమ్ముళ్లు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో తమ్ముళ్లు ఫ్యాన్ వైపు గా చూస్తున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీన్ని అనువుగా మార్చుకోవటానికి వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. దీంట్లో భాగంగానే పెద్దిరెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ లో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. దీంతొ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో మళ్లీ సీన్ రివర్స్ అయింది. 44 మంది పోటీ చేసినా గెలుస్తామనుకున్న స్థానాల్లో టీడీపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఆలోచనలో పడ్డాకగ. తమ్ముళ్లను బుజ్జగించటానికి వెళ్లినవారిని తిరిగి తెచ్చుకోవటానికి చంద్రబాబు…మరోసారి కుప్పం పర్యటన చేపట్టారు.

Read more :Andhra Pradesh : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

కాగా చాణక్య వ్యూహాలతో ప్రత్యర్థులను అంచనాలను తల్లిక్రిందులు చేస్తారనే పేరున్న చంద్రబాబు మరి తన నియోజకవర్గంలో తమ్ముళ్లను దారికి తెచ్చుకుని తన కంచుకోట కప్పాన్ని ఎవ్వరు ఛేధించలేరని నిరూపించుకోవటానికి మరోసారి కుప్పం పర్యటనలో చంద్రబాబు బిజి బిజీ కానున్నారు. పార్టీ కార్యకర్తల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ బలోపేతానికి, నాయకులు.., కార్యకర్తల మధ్య సయోధ్య కుదిర్చే విధంగా పలువులు కదిపేందుకే చంద్రబాబు మరోమారు కుప్పంలో పర్యటన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీకి వ్యతిరేకంగా మారుతున్న పరిణామాలను చక్కదిద్దే విధంగా ఈ సారి ఆయన టూర్ ఉంటుందని క్యాడర్ నమ్ముతోంది.