CM Jagan Pulivendula : భారీ పరిశ్రమలు, వేలాది ఉద్యోగాలు.. సొంత నియోజకవర్గంపై సీఎం జగన్ వరాల జల్లు

పులివెందుల ఇండస్ట్రియల్ పార్కుకు చేరుకున్న సీఎం జగన్... ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీ ద్వారా సుమారు 2వేల మందికి ఉద్యోగావకాశాలు..

CM Jagan Pulivendula : భారీ పరిశ్రమలు, వేలాది ఉద్యోగాలు.. సొంత నియోజకవర్గంపై సీఎం జగన్ వరాల జల్లు

Cm Jagan

CM Jagan Pulivendula : కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఆయన తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. ఇడుపులపాయ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పులివెందుల ఇండస్ట్రియల్ పార్కుకు చేరుకున్న సీఎం జగన్… ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీ ద్వారా సుమారు 2వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని సీఎం జగన్ తెలిపారు. ఒక్క పులివెందులలోనే భవిష్యత్తులో 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.

అంతకముందు పులివెందులలో జగనన్న హౌసింగ్‌ కాలనీకి చేరుకుని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు జగన్. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. కోర్టు కేసుల కారణంగా కార్యక్రమం ఆలస్యమైందని.. పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నామన్నారు. ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం రూ.2 లక్షలు ఉంటుందని.. జగనన్న కాలనీలో 8042 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ.6 లక్షలు ఖర్చు పెడుతోందన్నారు.

Xiaomi 11i Hypercharge : ఫాస్ట్ హైపర్‌‌చార్జ్ స్మార్ట్‌ఫోన్‌.. 15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్.. జనవరి 6న వచ్చేస్తోంది!

పులివెందులలో మైకులు కొట్టే ఆనందం ఎక్కడా దొరకదన్నారు జగన్. 323 ఎకరాల్లో హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేసే అవకాశం దేవుడు తనకు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని రకాల సదుపాయాలతో, వసతులతో కాలనీ నిర్మాణానికి రూ.127 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రెండేళ్ల తర్వాత వీటి విలువ పది లక్షలు పెరుగుతుందన్నారు. అంత ఆస్తిని కల్పించే విధంగా చేస్తున్నామన్నారు జగన్.

కాలనీలో పాఠశాలలు, సచివాలయాలు, పార్కు, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలనీకి సమీపాన ఉపాధి కల్పించేందుకు భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలనీతో పాటు పరిశ్రమలను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. 6వేల టన్నుల చీనీ నిల్వ ఉంచేందుకు గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చేపలు, రొయ్యలు వంటి మత్స్య సంపదను అందుబాటులోకి తెచ్చేందుకు పులివెందులలో ఆక్వా హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Garlic : రోజూ వెల్లుల్లి తీసుకుంటే బరువు తగ్గవచ్చా?

రాష్ట్రంలో 74 ఆక్వా హబ్ లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు సీఎం జగన్. పులివెందులలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌కు రూ.100 కోట్లు కేటాయించామని.. రూ.65 కోట్లతో సమగ్రనీటి పథకం, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామన్నారు. ప్రతి మండలానికి మార్కెటింగ్‌ గిడ్డంగి నిర్మాణం చేపడతామన్నారు సీఎం జగన్. వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులు 2023 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కోసం శిల్పారామాన్ని రూ.13కోట్లతో పునరుద్దరించి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 2022 నాటికి స్పోర్ట్స్ అకాడమీ పూర్తి చేస్తామన్నారు. వంద కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మార్చిలోపు పూర్తి చేస్తామన్నారు.