విన్నపాలు వినవలె : సీఎం జగన్ ఢిల్లీ టూర్

  • Published By: madhu ,Published On : December 6, 2019 / 12:35 AM IST
విన్నపాలు వినవలె : సీఎం జగన్ ఢిల్లీ టూర్

ఢిల్లీ పర్యటన వెళ్లిన ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం జరిగే ఈ సమావేశంలో విభజన సమస్యలు, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణాలతో పాటు పోలవరానికి రావాల్సిన నిధులపై చర్చించే చర్చించే అవకాశముంది. పోలవరం ప్రాజెక్ట్ టెండర్లు రద్దు చేసిన జగన్… రివర్స్ టెండరింగ్‌పై ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సమయంలో ప్రధానికి వివరించారు. ఇప్పుడు నిధులు విడుదల చేయాలని కోరే అవకాశముందని సమాచారం.

ఇక… డిసెంబర్  23న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన జరగనుంది. మరోవైపు జనవరి 9న అమ్మఒడి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ రెండు కార్యక్రమాలకు ప్రధాని మోదీని జగన్‌ను ఆహ్వానించనున్నారు. మోదీతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్‌ సమావేశమయ్యే అవకాశముంది. ఉదయం 10 గంటలకు… కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యే అవకాశముంది.

వాస్తవానికి రాత్రే అమిత్‌షాతో జగన్‌ భేటీ కావాల్సి ఉంది. అనుకోకుండా వీరి భేటీ వాయిదా పడింది. జగన్-అమిత్ షా మధ్య జరిగే సమావేశంలో విభజన సమస్యలపైనే కీలక చర్చ జరగనుందని తెలుస్తోంది. ఇక హస్తిన టూర్‌ కోసం వచ్చిన జగన్‌ పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్‌ వారితో చర్చించారు. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు.
Read More : ఏపీలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు