AP News: అధిక వడ్డీ ఆశచూపి.. రూ.152కోట్లు కుచ్చుటోపీ పెట్టారు..

ప్రజల ఆశలను ఆసరా చేసుకుంటున్న కొందరు వారిని నిలువునా మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. అధిక వడ్డీలు ఆశచూపి వేలాది మంది వద్ద డబ్బులు వసూళ్లుచేసిన చెన్నైకి చెందిన నోబెల్‌ అసెట్స్‌ సంస్థ మోసాలకు పాల్పడింది.

AP News: అధిక వడ్డీ ఆశచూపి.. రూ.152కోట్లు కుచ్చుటోపీ పెట్టారు..

Money

AP News: ప్రజల ఆశలను ఆసరా చేసుకుంటున్న కొందరు వారిని నిలువునా మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. అధిక వడ్డీలు ఆశచూపి వేలాది మంది వద్ద డబ్బులు వసూళ్లుచేసిన చెన్నైకి చెందిన నోబెల్‌ అసెట్స్‌ సంస్థ మోసాలకు పాల్పడింది. సంస్థ నిర్వాహకుల మాయమాటలకు మోసపోయిన ప్రజలు సుమారు రూ.152 కోట్ల మేర నష్టపోయారు. బాధితులంతా పుత్తూరు, తిరుపతి, తిరుత్తణి, చెన్నై ప్రాంతాలకు చెందిన వారు.

Ap news: మహిళను స్తంభానికి కట్టేసిన గ్రామస్థులు.. ఆమె చేసిన పనికి ..

చెన్నై కేంద్రంగా పనిచేసే నోబెల్‌ అసెట్స్‌ సంస్థ 2018లో పుత్తూరులో కార్యాలయం ప్రారంభించింది. చెన్నై, తిరుత్తణి కేంద్రంగా రూ.100 కోట్ల పైబడి ఫారిన్‌ ట్రేడింగ్, షేర్‌మార్కెట్‌ వ్యాపారాలు సాగిస్తున్నామని వారు చెప్పుకొచ్చారు. తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన నగదును అంతర్జాతీయ షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అమెరికన్‌ డాలర్, యూరప్‌ యూరోల్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఈ క్రమంలోనే పలు గ్రామాలకు చెందిన ప్రజలు వారిని నమ్మి పెట్టుబడులు పెట్టారు. తొలుత రూ.లక్ష పెట్టుబడికి నెలకు రూ.8వేలు వడ్డీ గిట్టుబాటయ్యేలా ఏర్పాట్లుచేశారు. ఇది చూసి మరికొంత మంది పెట్టుబడులు పెట్టారు.

AB Venkateswara Rao: జగన్, ఆమెకు ఒక న్యాయం.. నాకు ఒక న్యాయమా? మళ్లీ కోర్టుకు వెళ్తా

ఏడాదిన్నర కాలంగా వడ్డీలు ఇవ్వకపోగా, అసలుకే ఎసరు పెట్టారు. వడ్డీలు, అసలు ఇవ్వాలని బాధితులు ఒత్తిడి పెంచడంతో.. పుత్తూరు, తిరుపతి, తిరుత్తణి, చెన్నై కేంద్రాల్లో ఉన్న సంస్థల్ని రాత్రికి రాత్రే ఖాళీచేసి సంస్థ నిర్వాహకులు ఉండాయించారు. తిరుపతిలోనూ బ్రాంచ్ ప్రారంభించిన సంస్థ నిర్వాహకులు.. ఇక్కడ రూ. 40కోట్ల మేర బాధితుల నుంచి వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.