Andhra Pradesh: బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల గుర్తింపు.. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా మృతదేహాలు

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం రాత్రి జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారు. అధికారులు మృతదేహాల ఆధారంగా వారిని గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Andhra Pradesh: బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల గుర్తింపు.. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా మృతదేహాలు

Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం, కడియద్ద వద్ద గురువారం రాత్రి బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భారీ పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‪కు ప్రధాని మోదీ అపాయింట్‪మెంట్ ఖరారు

మృతులను యాళ్ల ప్రసాద్, దెయ్యాల స్వామి, దూళ్ల నానిగా గుర్తించారు. గాయపడిన సాల్మన్ రాజును మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. మృతులను కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరుకు చెందిన వారిగా గుర్తించారు. సాల్మన్ రాజు నల్లజర్ల మండలం అనంతపల్లి నుంచి వచ్చారు. వీళ్లంతా బాణాసంచా పేలుడు కేంద్రంలో పని చేసేందుకు ఇక్కడికి వచ్చారు. ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో 15 కేజీల పేలుడు పదార్థం తయారు చేసేందుకే యజమాని అనుమతి తీసుకున్నాడు.

కానీ, ఈ నిబంధనకు విరుద్ధంగా సుమారు 100 కేజీలకు పైగా పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం పేలుడు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు పేలుడు ధాటికి మృతదేహాలు దాదాపు 300 మీటర్ల దూరంలో ఎరిగిపడ్డాయి.