AP Heavy Rain: ముంచుకొస్తున్న తుఫాన్.. ఆ మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రం వాయుగుండంగా మారింది. గురువారం ఉదయం పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకుంటుంది. దీని ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

AP Heavy Rain: ముంచుకొస్తున్న తుఫాన్.. ఆ మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు

Heavy rains in AP

AP Heavy Rain:బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం తీరంవైపు దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 1020 కి.మీ దూరంలో తూర్పు – ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. మాండస్ తుఫాన్ ( తుఫాను మాండౌస్) గురువారం ఉదయం పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకుంటుంది. ఈ తుఫాను 9న తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Heavy Rains In AP : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. ఇల్లు కూలి వ్యక్తి మృతి

తుఫాను ప్రభావంతో 8, 9, 10 తేదీల్లో దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బాధిత జిల్లాల పాలనాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలాఉంటే మత్స్యకారులు శనివారం వరకు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర సహాయక, సమాచారంకోసం 24గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూం నెంబర్లు 1070, 18004250101, 08632377118లను సంప్రదించాలని సూచించారు.

AP Heavy Rains Cyclone : వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం..భారీ వర్షాలు పడే అవకాశం

ముంచుకొస్తున్న తుఫాను కారణంగా.. తమిళనాడు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. విల్లుపురం, చెంగల్ పట్టు, కడలూరు, కాంచీపురం, తిరువళ్లూరు, అరియాలూరు, పెరంబలూరు, చెన్నై, కళ్లకురిచ్చి, మైలదుత్తురై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రానికి చేరుకున్నాయి.