Janasena : జనసేన ప్రభుత్వం వస్తే ఉచితంగా ఇస్తాం

అధికారంలోకి వచ్చేది జనసేన అన్న నాదెండ్ల మనోహర్, తమ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని హామీ ఇచ్చారు. కరోనాతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఓటీఎస్‌ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేయడం..

Janasena : జనసేన ప్రభుత్వం వస్తే ఉచితంగా ఇస్తాం

Janasena : జనసేన అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తామని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ హామీ ఇచ్చారు. గతంలో రూ.2వేలు ఇసుక ధర.. ఈ రోజు రూ.8వేలకి చేరిందన్నారు. లంచాలు మరిగి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చేది జనసేన అన్న నాదెండ్ల మనోహర్, తమ ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తుందని చెప్పారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో జనసేన బహిరంగసభలో పాల్గొన్న నాదెండ్ల.. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

గుంటూరు జిల్లాలో మొక్కజొన్న కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. పంట అమ్ముకోవాలంటే రైతులు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్దితి ఏర్పడిందని వాపోయారు. ఓటీఎస్ కోసం ఎంతమందిపై కేసులు పెడతారో చూస్తామన్నారు. 30ఏళ్ల నుండి నివాసం ఉంటున్న ఇళ్లకు వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరుతో పేదలను దోచుకోవడం అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. డ్వాక్రా నిధులనూ ప్రభుత్వం లాక్కుంటోందన్నారు.

Komaki Ranger : కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు

తీర ప్రాంత ప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వడం లేదని నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. జనసేన రాజకీయ ప్రస్థానం.. పదవుల కోసం కాదు ప్రజాసేవ కోసం అన్నారు.

Hemoglobin : రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచే 3 రకాల ఆహారాలు ఇవే..!

”దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలతో పాలన సాగుతోంది. కరోనాతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఓటీఎస్‌ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేయడం దారుణం. అధికారులకు టార్గెట్‌ ఇచ్చి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. అమరావతి కోసం చిన్న సన్నకారు రైతులు తమ భూములను త్యాగం చేస్తే సీఎం జగన్‌ వారిని అవమానించి రోడ్డుకు లాగారు. వాలంటీర్‌ వ్యవస్థతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సీఎం జగన్‌ తీరు ‘మాగ్జిమం కరప్షన్‌ మినిమం సీఎం’గా అన్నట్టుగా ఉందని” నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు.