AP Government: అక్టోబర్ 1 నుంచి ఏపీలో వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా.. అర్హతలు ఇవే..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీతోఫాను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది.

AP Government: అక్టోబర్ 1 నుంచి ఏపీలో వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా.. అర్హతలు ఇవే..

AP CM YS JAGAN

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీతోఫాను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ఈ పథకం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు వర్తించనుంది. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది

CM YS Jagan: టార్గెట్ కుప్పం.. 22న చంద్రబాబు అడ్డాలో సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

ఈ పథకంలో ఫలాలు పొందాలంటే.. తొలి వివాహానికి మాత్రమే అర్హత ఉంటుంది. వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 12 ఏళ్లు నిండి ఉండాలి. అదేవిధంగా వధువు, వరుడు పదవ తరగతి పాస్ అయ్యిఉండాలి. ఇరువురి కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాతాల్లో రూ.12వేలలోపు ఆదాయం కలిగి ఉండాలి. మూడెకరాలకు మించి మాగాణి, పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉంటే ఈ పథకానికి అనర్హులు. అయితే మెట్ట, మాగాణి కలిపి పదెకరాల్లోపు ఉండొచ్చు. కుటుంబాల్లోని సభ్యులెవరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోగానీ, ప్రభుత్వ సంస్థల్లో గానీ, ప్రభుత్వ ఉధ్యోగిగా, పెన్షనర్ గా ఉండకూడదు. అయితే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది. అదేవిధంగా టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. వరుడు, వధువు కుటుంబాలు ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు. ఇలా పలు రకాల అర్హతలు, విధివిధానాల నడుమ ప్రభుత్వం నూతన పథకాన్ని అమల్లోకి తేనుంది.

CM YS Jagan: సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టాం .. వైఎస్ఆర్ నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన జగన్

– ఎస్సీ, ఎస్టీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు, కులాంతర వివాహాలకు లక్షా 20 వేల రూపాయలు కానుకగా ఇవ్వనున్నారు.

– బీసీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద 50వేలు, బీసీలో కులాంతర వివాహాలకు 75 వేల రూపాయలు ఇవ్వనున్నారు.

– షాదీ తోఫా కింద మైనార్టీలకు లక్ష రూపాయలు. దివ్యాంగులు వివాహాలకు లక్షన్నర, భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు 40 వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.