Kodali Nani: నలుగురు ఎమ్మెల్యేలను కొన్నారు.. 4 సీట్లే వస్తాయి.. ఇది దేవుడి స్క్రిప్ట్

ఎన్టీఆర్ పేదల కోసం చిత్తశుద్ధితో పని చేశారు. ఎన్టీఆర్ మహానుభావుడు. పేదల, బడుగు బలహీనవర్గాల కోసం కష్టపడ్డారు. ఎన్టీఆర్ పేరును వైసీపీ స్మరిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్‌ను ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి వచ్చింది? ఆయన కాళ్లు పట్టుకు ఎందుకు లాగేశారు?

Kodali Nani: నలుగురు ఎమ్మెల్యేలను కొన్నారు.. 4 సీట్లే వస్తాయి.. ఇది దేవుడి స్క్రిప్ట్

Kodali Nani

Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును చూస్తే వెన్నుపోటు గుర్తుకొస్తుందని విమర్శించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసి గెంటేశారో చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. బుధవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు.

Bhadradri: భద్రాద్రిలో రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి.. సీఎం కేసీఆర్ హాజరుపై సందిగ్ధత

‘‘ఎన్టీఆర్ పేదల కోసం చిత్తశుద్ధితో పని చేశారు. ఎన్టీఆర్ మహానుభావుడు. పేదల, బడుగు బలహీనవర్గాల కోసం కష్టపడ్డారు. ఎన్టీఆర్ పేరును వైసీపీ స్మరిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్‌ను ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి వచ్చింది? ఆయన కాళ్లు పట్టుకు ఎందుకు లాగేశారు? ఆయనపై ఎందుకు చెప్పులతో దాడి చేయించారు? ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసి, గెంటేశారు? చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలి. చంద్రబాబును చూస్తే వెన్నుపోటే గుర్తుకొస్తుంది.

10th Exams: ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

ఎన్టీఆర్, వైఎస్సార్ కలిపితే జగన్. ఆయనకు అభివృద్ధిపైనే దృష్టి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తాం.. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వండి అని ఎమ్మెల్యేలు అడిగినా.. కుదరదని జగన్ చెప్పారు. ఆయన అవకాశవాద రాజకీయాలు చెయ్యరు. 23 మంది ఎమ్మెల్యేల్ని కొంటే.. 2019లో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల్నే ఇచ్చాడు. ఇది దేవుడి స్క్రిప్ట్. ఇప్పుడు నలుగురిని కొన్నందుకు 2024లో కూడా నాలుగు సీట్లే వస్తాయి. ఇది కూడా దేవుడి స్క్రిప్టే. జగన్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ద్రోహం చేశారు’’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

Also Read: కోనసీమ అల్లర్ల వెనుక జనసేన నాయకులు.. పవన్ కళ్యాణ్ ఖండించాలి