Lella Appi Reddy : ముందు మీ ప్రజలను పట్టించుకోండి.. హరీశ్ రావుకు ఏపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కౌంటర్
Lella Appi Reddy : ప్రతిపక్షాలను ఎదుర్కొనే దమ్ము లేక డైవర్షన్ కోసం ఏపీ గురించి మాట్లాడతావా? అక్కడ ఇబ్బంది వచ్చినప్పుడల్లా..

Lella Appi Reddy (Photo : Google)
Lella Appi Reddy : ఏపీలో అభివృద్ధి గురించి తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అలజడి సృష్టించాయి. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఏపీకి చెందిన వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. హరీశ్ రావుపై ఎదురుదాడికి దిగారు. మంత్రి హరీశ్ రావుకి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.
హరీశ్ రావు మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆంధ్ర రాష్ట్రం పేరు ఎత్తే నైతిక అర్హత మీకు లేదన్నారు. ఏపీ గురించి ఎలా మాట్లాడతారు? మీకు సిగ్గుందా అని నిలదీశారు. మీకు కళ్లు కనిపించడం లేదా? ఏపీలో ఏం అభివృద్ధి జరుగుతుందో కనిపించడం లేదా? అని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫైర్ అయ్యారు. (Lella Appi Reddy)
”ఏ రంగంలో అయినా మీతో చర్చించడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక డైవర్షన్ కోసం ఏపీ గురించి మాట్లాడతావా? అక్కడ ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఏపీ గురించి మాట్లాడుతున్నారు. ఇది పద్దతి కాదు. మీలా కుటుంబ పాలన కాదు ఏపీలో జరుగుతున్నది. మీ కుటుంబ అభివృద్ధి కాదు. ప్రజల అభివృద్ధి పట్టించుకోండి.
నాలుగు చినుకులు పడితే రోడ్లు సముద్రంలా మారే దారుణమైన పరిస్థితులు హైదరాబాద్ లో ఉన్నాయి. వాటి గురించి మాట్లాడు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి లాభాల్లో ఉంటే మీరు వచ్చాక నష్టాల భాట పట్టింది. తెలంగాణ నుంచి వేలాది మంది బతకడం కోసం కూలీలుగా పనుల కోసం ఇక్కడికి వస్తున్నారు. ముందు మీ రాష్ట్రంలో ప్రజలను కాపాడుకోండి. (Lella Appi Reddy)
Also Read..Nellore City Constituency: నెల్లూరు పెద్దారెడ్లంతా.. అనిల్‌కు సహకరిస్తారా?
మాకూ నోరుంది. మేము చూస్తూ ఊరుకోము. తెలంగాణలో మాకున్న శక్తి అందరికీ తెలుసు. జాగ్రత్త. ఇప్పటివరకు మేము తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ప్రత్యేక హోదా గురించి ప్రజల సమక్షంలోనే సీఎం జగన్ ప్రధానిని అడిగారు. హోదా విషయంలో ఎక్కడా రాజీపడే పరిస్థితి లేదు. కేంద్రంతో లాలూచీ పడింది మీరు. గడిచిన నాలుగేళ్లు ఎందుకు పోరాటం చెయ్యలేదు” అని మంత్రి హరీశ్ రావుపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి.