Atmakuru Government Doctors : సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు ట్రీట్‌మెంట్‌..లెక్చరర్ మృతి-వైద్యశాఖ సీరియస్

ట్రీట్‌మెంట్ చేసిన సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని జిల్లా హాస్పిటల్‌ సర్వీస్ కో-ఆర్డినేటర్‌ రమేశ్‌నాథ్‌ చెప్పారు.

Atmakuru Government Doctors : సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు ట్రీట్‌మెంట్‌..లెక్చరర్ మృతి-వైద్యశాఖ సీరియస్

Atmakuru

Atmakuru government doctors : ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో లెక్చరర్‌ మృతి చెందిన ఘటనపై.. 10టీవీ కథనాలతో వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. పేషెంట్లకు సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు ట్రీట్‌మెంట్‌ చేయడంపై సీరియస్‌ అయ్యారు. ఘటనపై ప్రభుత్వానికి, వైద్య శాఖకు నివేదికలు పంపుతామని.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌, డ్యూటీ డాక్టర్‌, సెక్యూరిటీ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. హాస్పిటల్‌లో ఎవరి పని వారు చేయాల్సిందేనని.. ఈ ఘటనలో బాధ్యులైన వారిని కచ్చితంగా సస్పెండ్‌ చేస్తామన్నారు.

ట్రీట్‌మెంట్ చేసిన సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని జిల్లా హాస్పిటల్‌ సర్వీస్ కో-ఆర్డినేటర్‌ రమేశ్‌నాథ్‌ చెప్పారు. ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి లెక్చరర్‌ రామకృష్ణ బలి అయ్యాడు. నిన్న తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన పేషెంట్‌ రామకృష్ణను డాక్టర్లు పట్టించుకోలేదు. డ్యూటీలో ఉన్నా వైద్యులు పేషెంట్లను పట్టించుకోని పేషెంట్‌కు ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది ట్రీట్‌మెంట్‌ చేశారు.

Hyderabad : గర్భిణి మృతి-వైద్యుల నిర్లక్ష్యం అని ఆరోపణలు

ప్రభుత్వాసుపత్రి వైద్యులపై నమ్మకం లేక పేషెంట్‌ ను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న రామకృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే రామకృష్ణ చనిపోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.