Minister Roja : నెరవేరిన ఎమ్మెల్యే రోజా కల.. ఎట్టకేలకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్

వైసీపీ ఫ్రైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కల నెరవేరింది. ఎట్టకేలకు సీఎం జగన్ రోజాకు మంత్రి పదవి ఇచ్చారు.(Minister Roja)

Minister Roja : నెరవేరిన ఎమ్మెల్యే రోజా కల.. ఎట్టకేలకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్

Minister Roja

Minister Roja : వైసీపీ ఫ్రైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కల నెరవేరింది. కొత్త మంత్రివర్గంలో సీఎం జగన్ ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. ఎమ్మెల్యే రోజా మినిస్టర్ రోజా అయ్యారు. ఎట్టకేలకు రోజాకు మంత్రి పదవి దక్కింది. మంత్రివర్గంలో అవకాశంపై రోజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొలి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఆమె ఆశించారు. కానీ, రాలేదు. దీంతో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై ఆశలు పెట్టుకున్నారు. ఆమె ఆశలను సీఎం జగన్ నెరవేర్చారు. రోజా ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. ఎట్టకేలకు ఆమె మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

నిజానికి మంత్రి పదవి అనేది రోజా జీవిత కల. మొదటి విడతలోనే ఆమె మంత్రి పదవి ఆశించగా, చివరకు ఏపీఐఐసీ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో దశలో కచ్చితంగా తనకు మినిస్టర్ పోస్ట్ వస్తుందని భావించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు రోజాకు మంత్రి పదవిపై ఉత్కంఠ నడిచింది. చివరకు తుది జాబితాలో ఆమె పేరు ఉంది. తన కల నెరవేరడంతో రోజా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎన్నాళ్లో వేచిన కల ఇవాళ నెరవేరిందని రోజా వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.(Minister Roja)

Balineni : కేబినెట్ పునర్‌ వ్యవస్థీకరణపై బాలినేని తీవ్ర అసంతృప్తి

ఇక్కడ మరో అద్భుతం కూడా జరిగింది. నిజానికి కేబినెట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరోసారి పదవి దక్కడం పెద్దగా ఆశ్చర్యం కాదు. మరోసారి పెద్దిరెడ్డికి మంత్రిగా జగన్ అవకాశం ఇస్తారని అందరూ ఊహించిందే. అయితే, అనూహ్య పరిణామం ఏంటంటే.. నారాయణ స్వామికి రెండోసారి కూడా మంత్రి పదవి దక్కడం. నిజానికి నారాయణ స్వామికి మంత్రి పదవి నుంచి తప్పిస్తారని గడిచిన మూడు నాలుగు నెలలుగా ఎడతెగని ప్రచారం జరిగింది.

నారాయణ స్వామి కూడా అందుకు మానసికంగా సిద్ధమైపోయారు. సీఎం జగన్ నాకు రెండున్నరేళ్లు పదవి ఇచ్చారు, చాలా సంతోషం, పార్టీకి నా సేవలు కొనసాగిస్తాను అని చెబుతూ వచ్చారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో తనకు మంత్రి పదవి దక్కదని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ ఆశ్చర్యకరంగా ఫైనల్ లిస్టులో నారాయణ స్వామి పేరు కనిపించింది. ఇది వైసీపీ వర్గాలను చాలా ఆశ్యర్యానికి గురి చేసింది. అయితే, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే.. చిత్తూరు జిల్లా నుంచి ముగ్గురు వ్యక్తులకు కేబినెట్ లో చోటు దక్కడం విశేషం.(Minister Roja)

AP New Cabinet : ఏపీ కొత్త కేబినెట్.. జిల్లాల వారీగా అవకాశం

ఇక రోజాకు సంబంధించి ఓ ప్రత్యేకత ఉంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన వ్యక్తి. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలోని రెండు మండలాలు పుత్తూరు, వడమాల పేట తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చాయి. మిగిలిన ఐదు జిల్లాలు చిత్తూరు జిల్లాలోకి వచ్చాయి. ఆ విధంగా రోజా రెండు జిల్లాల మంత్రిగా గుర్తింపు పొందారు. మొత్తంగా రోజాకి మంత్రి పదవి దక్కడం, అనూహ్యంగా నారాయణ స్వామికి మరోసారి కేబినెట్ లో చోటు దక్కడం, అందరూ ఊహించినట్టుగానే పెద్దిరెడ్డికి మరోసారి మినిస్టర్ పదవి దక్కడం ఆసక్తికర పరిణామాలు. చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ మంత్రి పదవులను పదిలం చేసుకోవడం విశేషం. ఇకపై చిత్తూరు జిల్లా రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు.