MP Avinash Reddy : సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ

విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇవ్వడంపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఇవాళ హైదరాబాద్ లో విచారణకు రావాలని నిన్న సీబీఐ నోటీసులు ఇచ్చింది.

MP Avinash Reddy : సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ

Avinash Reddy

MP Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇవ్వడంపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఇవాళ హైదరాబాద్ లో విచారణకు రావాలని నిన్న సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందిస్తూ.. ఒక రోజు ముందుగా నోటీసులు పంపారని తెలిపారు. ఇవాళ వేరే కార్యక్రమాలను ముందుగానే అరెంజ్ చేసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. ఐదు రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా దర్యాప్తుకు వస్తానని చెప్పారు. దర్యాప్తుకు పూర్తి స్థాయి సహకారం అందిస్తానని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది.

అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర లేకపోవడంతో వాట్సాప్ ద్వారా సీబీఐ అధికారులు నిన్న నోటీసులు పంపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కుట్ర కోణంలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి
భాస్కర్ రెడ్డిలను విచారణకు హాజరు కావాలని, ఈ రోజు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని వాట్సాప్ ద్వారా ఆయనకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఆయన పర్సనల్ సెక్రటరీకి సైతం హార్డ్ కాపీని అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి.. ఒక్కరోజు ముందు ఈ సమాచారం ఇవ్వడంతో విచారణకు హాజరు కాలేపోతున్నానని చెప్పారు.

Supreme Court Judgment : వివేకా హత్య కేసు.. గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

తాను ప్రజా ప్రతినిధిగా అనేక కార్యక్రమాలకు షెడ్యూల్ చేసుకున్నాను.. కాబట్టి ఆ కార్యక్రమాలు చూసుకుని, ఐదు రోజుల తర్వాత ఎక్కడికి పిలిచినా వస్తానని చెప్పారు. విచారణకు పూర్తిస్థాయిలో
సహకారం అందిస్తానని ఈ మేరకు సీబీఐకి లేఖ రాశారు. అయితే దీనిపై సీబీఐ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, సీబీఐ అధికారులు మరోసారి పులివెందులకు వస్తున్నట్లు సమాచారం. కడప నుంచి సీబీఐ బృందం ఒకటి పులివెందులకు బయల్దేరినట్లు తెలుస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డికి డైరెక్ట్ గా నోటీసులు ఇచ్చి చర్చలు జరుపుతారా? లేదా అనేది తెలియాల్సివుంది.