Adimulapu Suresh : కరోనా కేసులు పెరుగుతున్నా తీవ్రత లేదు, ఇప్పటికైతే సెలవులిచ్చే ఆలోచన లేదు

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా తీవ్రత అంతగా లేదు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన ఇప్పటికైతే లేదు. పిల్లలకు కరోనా సోకితే.. ఆ పాఠశాల వరకే..

Adimulapu Suresh : కరోనా కేసులు పెరుగుతున్నా తీవ్రత లేదు, ఇప్పటికైతే సెలవులిచ్చే ఆలోచన లేదు

Adimulapu Suresh

Adimulapu Suresh : ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. స్కూళ్లు మూసివేయాలన్న డిమాండ్ పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పందించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా తీవ్రత అంతగా లేదని ఆయన చెప్పారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన ఇప్పటికైతే లేదని తేల్చి చెప్పారు. పిల్లలకు కరోనా సోకితే.. ఆ పాఠశాల వరకే సెలవు ప్రకటించి శానిటైజ్ చేశాక మళ్లీ తెరుస్తామని స్పష్టం చేశారు. కొన్ని యూనివర్సిటీలు పరీక్షలను కూడా నిర్వహిస్తున్నాయని, కోర్టు కూడా అందుకు ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు.

Star’s Negative Rolls: హీరోలే విలన్లు.. విలన్లే హీరోలు!

నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని, కొత్త కోర్సులను తీసుకొస్తున్నామని తెలిపారు. భవిష్యత్ కోసం ఆన్ లైన్ విద్యావిధానం తప్పనిసరి అని అన్నారు.

Perni Nani : సమ్మె వద్దు.. చెప్పుడు మాటలు వినొద్దు, జగన్ చాలా బాధపడుతున్నారు

ఇటు పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళనలపైనా మంత్రి మాట్లాడారు. సీఎంతో సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా నూతన పీఆర్సీకి అంగీకారం తెలిపారని, అలాంటిది ఇప్పుడు మళ్లీ ఆందోళనలు చేయడం సబబు కాదన్నారు. ఇబ్బందులుంటే ప్రభుత్వంతో చర్చించవచ్చని సూచించారు. ఇప్పుడు ఆందోళనలు చేయాల్సిన అవసరమేంటని మంత్రి ప్రశ్నించారు. గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ తో కలిసి ఆన్ లైన్ విద్యావిధానాన్ని ప్రారంభించారు మంత్రి ఆదిమూలపు సురేష్.