Ramdas Athawale : మూడు రాజధానులను అభివృద్ధి చేయడం చాలా కష్టం – కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

ఒక రాజధాని అమరావతిలోనే అభివృద్ధి సరిగా జరగడం లేదు. అలాంటప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన సరికాదు. మూడు రాజధానులను అభివృద్ధి చేయడం చాలా కష్టం.

Ramdas Athawale : మూడు రాజధానులను అభివృద్ధి చేయడం చాలా కష్టం – కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

Ramdas Athawale

Ramdas Athawale : ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రాజధాని అమరావతిలోనే అభివృద్ధి సరిగా జరగడం లేదన్న ఆయన… అలాంటప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన సరి కాదని అన్నారు. రెండు చోట్ల రాజధానులు పర్వాలేదని… మూడు రాజధానులతో ప్రజలకు సౌలభ్యంగానే ఉంటుందని… కానీ, మూడు రాజధానులను అభివృద్ధి చేయడం చాలా కష్టమని తేల్చి చెప్పారు. విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి మూడు రాజధానుల అంశంపై స్పందించారు.

Android 12 Feature : ఈ స్మార్ట్ ఫోన్లలోకి కూల్ ఆండ్రాయిడ్ 12 ఫీచర్ వస్తోంది.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కలసి కోరాలని సూచించారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీతో జగన్ చేతులు కలపాలని హితవు పలికారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం తాను కూడా ప్రయత్నిస్తానని చెప్పారు. పార్లమెంటులో పెట్టే అన్ని బిల్లులకు వైసీపీ మద్దతిస్తోందని తెలిపారు.

ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని ఇప్పటికీ రాష్ట్ర మంత్రులు చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?

”మూడు రాజధానుల కంటే అమరావతిని అభివృద్ధి చేయడమే మేలు. రాష్ట్ర విభజన సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాల్సింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ అంశాలను విస్మరించింది. ప్రస్తుతం అమరావతిలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. నిధులు లేకపోతే రాజధాని నిర్మాణం ఎలా కొనసాగుతుంది? వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటోంది. ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చెందడం లేదు. అలాంటప్పుడు 3 రాజధానుల అంశం సరికాదు. ఏ అంశానికైనా నిధులు ముఖ్యం. నిధులు లేకే అమరావతి అభివృద్ధి చెందడం లేదు” అని కేంద్రమంత్రి చెప్పారు.

ఏపీలో రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి ఒక్కటే రాజధాని, అదీ అమరావతే అని ప్రతిపక్షాలు చెబుతుండగా.. ఒకటి కాదు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటోంది. పరిపాలన సౌలభ్యం కోసం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడం కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటోంది.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశ పెడతామని ఇటీవలే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు. ప్రజల ఆమోదంతో మూడు రాజధానులు నిర్మిస్తామన్నారు. గతంలో శాసనమండలిలో తమకున్న బలంతో ఈ బిల్లులను టీడీపీ నిలిపివేసిందన్నారు. ప్రతిపక్షాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.