Red Alret : 9 జిల్లాలకు రెడ్ అలర్ట్… ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక

తుపాను కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీలోని తీరప్రాంత 9 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ విధించారు.

Red Alret : 9 జిల్లాలకు రెడ్ అలర్ట్… ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక

Red Alert

Red Alert : తుపాను కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీలోని తీరప్రాంత 9 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ విధించారు. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. తుపాను ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలపై కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తమిళనాడులోని కరైకల్, ఏపీలోని శ్రీహరికోట దగ్గరున్న కడలూరు సమీపంలో తుపాను తీరం దాటనుంది.

నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత రాత్రి నుంచి కురుస్తున్న వానలకు తిరుమల తడిసి ముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో తిరుమల ఆలయంతో పాటు వీధులు, కాటేజీలు, పార్కులు, రోడ్లు, వసతి సముదాయాలు జలమయమయ్యాయి.

Wi-Fi HaLow : సరికొత్త వై-ఫై టెక్నాలజీ వస్తోంది.. కిలోమీటర్ దూరంలోనూ Wi-Fi కనెక్ట్ కావొచ్చు!

నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. బాధితులకు మొదట మంచి ఆహారం అందించాలని, వారికి రూ.1000 చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో తలదాచుకునే ప్రజలను బాగా చూసుకోవాలని, ఎలాంటి లోటు రానివ్వొద్దని అన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తగినన్ని ఔషధాలను సిద్ధం చేసుకోవాలన్నారు.

“విద్యుత్ వ్యవస్థ సజావుగా నడిచేలా చూడండి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతింటే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోండి. ఎలాంటి సమస్య వచ్చినా విద్యుత్ శాఖ సిబ్బంది ఆగమేఘాలపై కదలాలి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేయించండి. ముఖ్యంగా, చెరువుల నిర్వహణ పరంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. గండ్లు పడకుండా తగిన ఏర్పాట్లు చేయండి. పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంది… రిజర్వాయర్లు, చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి” అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

WhatsApp: మీ వాట్సాప్‌లో చాట్‌ డిలీట్ అయిందా? ఇలా రికవరీ చేసుకోవచ్చు!

ఏం కావాలన్నా తక్షణమే అడగండి… అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఇక, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలు కేంద్రంగా మరో రెండు ఎన్డీఆర్ఎఫ్ దళాలు, మంగళగిరిలో మరికొన్ని అదనపు బృందాలు సిద్ధంగా ఉన్నాయని సీఎం వివరించారు.

భారీ వర్షాలతో తిరుమలలో కొండచరియలు విరిగిపడటం ఆందోళన కలిగిస్తుంది. తిరుమల నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. మొదటి ఘాట్ రోడ్డులోని రెండో మలుపు దగ్గర ఘటన జరిగింది. ఫలితంగా ఘాట్ రోడ్ లో భారీ స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాత్రి 8 గంటలకు మొదటి, రెండో ఘాట్ రోడ్లను మూసివేయనున్నట్లు పర్యాటకులకు టీటీడీ సూచించింది. తిరిగి శుక్రవారం ఉదయం 6గంటలకు తెరవనున్నారు.