Sajjala : సమ్మెకి వెళ్తే చర్యలు, రాజకీయ పార్టీలు ఎంటరైతే ఉద్యోగులకే నష్టం -సజ్జల

రాజకీయ పక్షాలు ఎంటర్ అయితే పరిస్థితి చేయి దాటిపోతుందని.. ఉద్యోగ సంఘాలను హెచ్చరించారు సజ్జల. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.

Sajjala : సమ్మెకి వెళ్తే చర్యలు, రాజకీయ పార్టీలు ఎంటరైతే ఉద్యోగులకే నష్టం -సజ్జల

Sajjala Ramakrishna Reddy

Sajjala : ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కగిలించేలా పరిస్ధితి వెళ్తుందన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు.. మాటలు పక్కన పెట్టి కోర్ ఇష్యూస్ పై వచ్చి మాట్లాడాలని సూచించారు సజ్జల. ఉద్యోగ సంఘాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చర్చలకు రావొచ్చని ఆయన అన్నారు. రోజూ ఆహ్వానం ఉండదని, గతంలో లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆహ్వానం మేరకు చర్చలకు రావొచ్చని సజ్జల చెప్పారు. మీ మీద మీరు ఒత్తిడి, కోపం ప్రదర్శించుకున్నట్లే ఉందని ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు సజ్జల.

అదే సమయంలో రాజకీయ పక్షాలు ఎంటర్ అయితే పరిస్ధితి జఠిలం అవుతుందని, చేయి దాటిపోతుందని.. ఉద్యోగ సంఘాలను హెచ్చరించారు సజ్జల. రాజకీయ పార్టీలకు అవకాశం ఇస్తే ప్లేయర్స్ మీరుండరు .. వారు వస్తారు.. అని చెప్పారు. ఎక్కువ మంది లెఫ్ట్ పార్టీల వారు చలో విజయవాడ సభకు వచ్చారని సజ్జల ఆరోపించారు. వారంతా రాకుండా అంత పెద్ద గ్యాదరింగ్ జరగదని అన్నారు. రాజకీయ పార్టీల వారు కూడా చలో విజయవాడ సభకు కచ్చితంగా వచ్చారని అన్నారు. మేము ఏదైతే వద్దంటున్నామో అటువైపే వెళ్తున్నారని సజ్జల మండిపడ్డారు.

Stomach Problem : పొట్ట సమస్య బాధిస్తుందా!…పరిష్కారం మీ చేతుల్లో..?

”రాజకీయ పార్టీలు ఎంటరైతే ఉద్యోగులకే నష్టం. అత్యవసర పరిస్ధితుల్లో ఉన్న హెల్త్ డిపార్టుమెంట్ వారు సమ్మెలోకి వెళ్తే జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహిస్తారు. గతంలో ప్రాసెస్ లో ఉన్న బదిలీలే ఇప్పుడు జరుగుతున్నాయి. మేము నోటీసులు ఇచ్చాం కాబట్టి మా పై చర్యలు తీసుకోవద్దని అంటారా? విధులకు భంగం కలిగించినా చర్యలు తీసుకోవద్దంటారా? ఉద్యోగ సంఘాలు కావాలని మీరంతట మీరే పరిస్ధితిని చెడగొట్టుకునేలా చేస్తున్నారు. ఉద్యోగుల 3 డిమాండ్లకు ఏమైనా అర్థముందా? చర్చల్లో పీఆర్సీ సమస్యలు పెడితే సమస్యలు పరిష్కారానికి అవకాశం ఉంటుంది.

ఉద్యోగులు కావాలనే పరిస్ధితిని చేజేతులా చెడగొట్టుకుంటున్నారు. రాజకీయ పార్టీలు ప్రవేశిస్తే ఆ తర్వాత ఏం జరిగినా దానికి ఉద్యోగ సంఘాలే బాధ్యులు అవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏం చేయాలో అన్ని ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చోవాలని అనుకునే వారికి ప్రభుత్వ చర్యలు తప్పుగా కనిపిస్తాయి. ఆర్టీసీ, విలేజ్ సెక్రటేరియట్ ఏర్పాటు వల్లే ఆర్ధిక భారం పెరిగింది.

Omicron: ఒమిక్రాన్ ఒకే మనిషికి మళ్లీ మళ్లీ వస్తదా..

సమ్మె నోటీసులో 75 డిమాండ్లలో ఎంతవరకు పరిష్కరానికి నోచుకుంటాయో తెలియదు. చర్చలు జరిపితేనే సమస్యలు పరిష్కారంపై స్పష్టత వస్తుంది. ఓపెన్ మైండ్ ఏంటి…. క్లోజ్డ్ మైండ్ ఏంటి.. మేము ఏ మైండ్ తో ఉంటే మీకేంటి… సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనేది చూడాలి. ఇష్యూను నాన్చడం, సాగించడం మంచిది కాదు. చర్చలకు వస్తామని చెబితే మేము సిద్దంగా ఉంటాం” అని సజ్జల అన్నారు.