Chandrababu Budget 2022 : బడ్జెట్ బాగోలేదు, నదుల అనుసంధానంపై ప్రణాళికలు మాత్రం బాగున్నాయి-చంద్రబాబు

కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని అన్నారు. పేదలు, రైతుల కోసం ఏం చేస్తున్నారో బడ్జెట్ లో చెప్పలేదని విమర్శించారు. వార్షిక బడ్జెట్ లో వేతన జీవులకు మొండిచేయి చూపించారని అన్నారు.

Chandrababu Budget 2022 : బడ్జెట్ బాగోలేదు, నదుల అనుసంధానంపై ప్రణాళికలు మాత్రం బాగున్నాయి-చంద్రబాబు

Chandrababu Budget 2022

Chandrababu Budget 2022 : కేంద్ర బడ్జెట్ 2022-23పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని అన్నారు. పేదలు, రైతుల కోసం ఏం చేస్తున్నారో బడ్జెట్ లో చెప్పలేదని విమర్శించారు. వార్షిక బడ్జెట్ లో వేతన జీవులకు మొండిచేయి చూపించారని అన్నారు.

కాగా, నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలు బాగున్నాయని చంద్రబాబు ప్రశంసించారు. డిజిటల్, సోలార్, విద్యుత్ ఆధారిత వాహనాల రంగంలో సంస్కరణలను స్వాగతిస్తున్నామని, ఇది మంచి పరిణామం అని చంద్రబాబు తెలిపారు. ఇక, బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాల సాధనలో వైసీపీ మరోసారి విఫలమైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. 28 మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు.

Union Budget 2022: బడ్జెట్ తర్వాత బూట్లు, బట్టల ధరలు తగ్గాయి.. ఏవి పెరిగాయో తెలుసా?

”పంటలకు మద్దతు ధర విషయంలో ఎటువంటి సానుకూల నిర్ణయాలు లేవకపోవడం బాధాకరం. పేద వర్గాలు, కరోనాతో దెబ్బతిన్న రంగాలకు ఎలాంటి చేయూతనిస్తారో కూడా ఈ బడ్జెట్‌లో చెప్పలేదు. జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేయడం సరికాదు. నిత్యవసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో వాటిని తగ్గించేందుకు ఎటువంటి చర్యలను ప్రకటించకపోవడం సమంజసం కాదు. విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన విధానం బాగుంది” అని చంద్రబాబు అన్నారు.

CM KCR : కేంద్ర బడ్జెట్ చాలా దారుణంగా ఉంది : సీఎం కేసీఆర్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని మంత్రి అన్నారు. కేంద్ర బడ్జెట్ ను ఆమె ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి.