Dhulipalla Narendra Arrest : టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడమే దీనికి కారణం. వైసీపీ నేతల మట్టి దోపిడీని నిరసిస్తూ టీడీపీ నేతలు చలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు.

Dhulipalla Narendra Arrest : టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడమే దీనికి కారణం. అసలేం జరిగిందంటే.. గుంటూరు జిల్లాలో అధికార వైసీపీ నేతల మట్టి దోపిడీని నిరసిస్తూ టీడీపీ నేతలు చలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు. ఇది గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది.
అలర్ట్ అయిన పోలీసులు చలో అనుమర్లపూడిని అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా భారీగా పోలీసులు మొహరించారు. అలాగే అనుమర్లపూడికి వెళ్లకుండా టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
అయితే, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆంక్షలు దాటుకుని తన అనుచరులతో కలిసి అనుమర్లపూడి చెరువు వద్దకు చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఆందోళనలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై నరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ సహా ఎవరి అనుమతులతో చెరువును తవ్వుతున్నారని ప్రశ్నించారు. అధికార వైసీపీ అరాచకాలకు అంతులేకుండా పోతోందని మండిపడ్డారు.(Dhulipalla Narendra Arrest)
Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఊరట.. అధికారుల తీరుపట్ల ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. ఛలో అనుమర్లపూడి పిలుపు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ధూళిపాళ్ల ఇంటి వద్ద మోహరించారు. అయితే పోలీసుల కళ్లుగప్పి, చెక్ పోస్టులను దాటుకుని ఎలాగో అనుమర్లపూడి చెరువువద్దకు చేరుకున్న ధూళిపాళ్ల అక్కడ ఆందోళనకు దిగారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Pawan Kalyan: దసరా తర్వాత వైసీపీ నాయకుల సంగతి చూస్తాం.. అప్పటి వరకు భరిస్తాం
మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ నేతలు అనుమర్లపూడి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ కుమార్, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనుమర్లపూడికి వెళ్లడానికి సిద్దమవుతుండగా వీరి ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో కాసేపు టీడీపీ నాయకులు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.
ఇక చలో అనుమర్లపూడికి వెళ్లేందుకు సిద్దమైన టీడీపీ నేతలు.. మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, డేగల ప్రభాకర్‌ను సైతం పోలీసులు గృహనిర్భందం చేశారు. చలో అనమర్లపూడి నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. అనమర్లపూడిలో భారీగా మోహరించారు. దారి వెంబడి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
అనుమర్లపూడి పోలీసుల వలయంలో ఉంది. చుట్టుపక్కలంతా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గ్రామంలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు పోలీసులు. ప్రస్తుతం అనుమర్లపూడిలో 144 సెక్షన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి నిరసనలకు అనుమతించడం లేదన్నారు. తమ హెచ్చరికలను పట్టించుకోకుండా అనుమర్లపూడికి చేరుకుంటున్న టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, టీడీపీ నాయకులు మాత్రం తగ్గేది లేదంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఛలో అనుమర్లపూడిని విజయవంతం చేయాలని పట్టుదలతో ఉన్నారు.
- Chandrababu Warning : వచ్చేది నేనే.. తప్పుడు అధికారులను వదలను- చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
- Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు
- వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్
- N.Chandrababu Naidu: ఆటో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదమన్న లోకేష్
- Kodali Nani : చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
1Tirumala Income : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. పదేళ్ల రికార్డు బద్దలు
2Drinking Beer: బీర్ తాగితే పేగులకు మంచిదట
3CM Jagan Request : ప్రత్యేక హోదా ఇవ్వండి.. అల్లూరి సాక్షిగా ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి
4Russia-Ukraine War: వాళ్లను రెస్ట్ తీసుకోమన్న పుతిన్.. ఎందుకో తెలుసా..
5Donation Boxes: పాక్ సంస్థకు భారత్‌లో విరాళాల సేకరణ
6Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
7Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
8Imran Khan: అమెరికా కుట్ర ఆరోపణలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్షమాపణ
9Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
10PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
-
Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!