Viveka Murder Case : వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి.

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

viveka

Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఎర్ర గంగిరెడ్డికి ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. వివేకా హత్య కేసులో సాక్షులను గంగిరెడ్డి ప్రభావితం చేసే అవకాశం ఉందని, అయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఇప్పటికే సుప్రీంకోర్టు వివేక హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో వివేకా కుమార్తె సునితా రెడ్డి ఇంప్లీడ్ అయివున్నారు. ఆమె అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత వాదనలు ముగిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.

Key Evidence : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక ఆధారాలు

ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఇన్వెస్టిగేషన్, ఆ తర్వాత సీబీఐకి బదిలీ అయింది. ఈనేళ్లుగా కేసు దర్యాప్తు కొనసాగుతుండటం, విచారణలో జాప్యం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతోనే వేగవంతంగా కేసు విచారణను పూర్తి చేసేందుకే ఈ కేసును హైదరాబాద్ కు బదిలీ చేశారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించనుంది. ఈ కేసులో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి మరి.