టీటీడీ ఆదాయ వ్యయాలను ఆడిట్ చేయనున్న కాగ్, థాంక్స్ చెప్పిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి

  • Published By: madhu ,Published On : September 3, 2020 / 01:42 PM IST
టీటీడీ ఆదాయ వ్యయాలను ఆడిట్ చేయనున్న కాగ్, థాంక్స్ చెప్పిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి

టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదాయ వ్యయాలను కాగ్ తో ఆడిట్ చేయించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో టీటీడీ నిధుల వ్యయంపై అడిట్ చేయనున్నారు. భవిష్యత్ లో కూడా కాగ్ తో అడిట్ కొనసాగించాలని టీటీడీ భావిస్తోంది. ఈ నిర్ణయం పట్ల సీఎం జగన్ కు ఎంపీ సుబ్రమణ్య స్వామి కృతజ్ఞతలు తెలిపారు.



2014 నుంచి 2019 వరకు టీటీడీ నిధుల కేటాయింపులో అక్రమాిలు జరిగినట్లు, దీనిపై కాగ్ ద్వారా అడిట్ జరపాలని ఎంపీ సుబ్రమణ్యం, సత్యపాల్ సభర్వాల్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం స్టేట్ ఆడిట్ ద్వారా అడిట్ జరుగుతుంది, కానీ ఆరోపణలు రావడంతో కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.
https://10tv.in/pubg-mobile-among-118-additional-chinese-apps-banned-by-government/
దీనిపై ఎంపీ సుబ్రమణ స్వామి స్పందించారు. టీటీడీ తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. తన ప్రతిపాదనను సీఎం జగన్, టీటీడీ ఛైర్మన్ వైవీ, పాలకమండలి సభ్యలు గొప్ప మనస్సుతో ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.