Tirumala Ghat Road Restoration : తిరుమల దిగువ ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకల పునరుద్ధరణ

తిరుమల నుంచి తిరుపతికి   వెళ్లే దిగువ ఘూట్ రోడ్డును టీటీడీ అధికారులు పునరుధ్దరించారు.

Tirumala Ghat Road Restoration : తిరుమల దిగువ ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకల పునరుద్ధరణ

Tirumala Down Ghat Road

Updated On : November 19, 2021 / 9:47 AM IST

Tirumala Ghat Road Restoration :  తిరుమల నుంచి తిరుపతికి   వెళ్లే దిగువ ఘూట్ రోడ్డును టీటీడీ అధికారులు పునరుధ్దరించారు. ఈ ఘాట్ రోడ్డునుంచే ప్రస్తుతం  రాకపోకలు సాగించేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది.  గత కొన్ని  రోజులుగా   కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల గిరులు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడటం… రోడ్లు కోసుకుపోయి దెబ్బతినటంతో గత 4 రోజులుగా తిరుమల కొండపైకి వెళ్లే,వచ్చే రాహదారులును తాత్కాలికంగా మూసి వేసారు.

అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డు లో విరిగిపడ్డ   కొండచరియలను టీటీడీ అధికారులు, సిబ్బంది శ్రమించి తొలగింపజేశారు.
Also Read : BJP MLA Pratap Bheel Rape Case : ఉద్యోగం పేరుతో మహిళలపై అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే
భక్తుల సౌకర్యం దృష్యా ఈ మార్గంలోనే ఒక గంట పాటు తిరుమల నుంచి అలిపిరికి, ఇంకో గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున వాహనాలను అనుమతించడం జరుగుతోంది. భక్తులెవరు ఫోటోల కోసం వాహనాలు దిగడం, వాహనాలను ఆపి ఉంచడం లాంటివి చేసి తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

భారీ వర్షాల కారణంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్‌రోడ్‌లో అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో వాటి తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. మధ్యాహ్నం తరువాత పరిస్థితిని అంచనా వేసి ఈ మార్గంలో కూడా వాహనాలను అనుమతించే విషయం పై టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది.