Palnadu : దూరంగా ఉన్న పిల్లలు…మానసిక ఒత్తిడితో తల్లి ఆత్మహత్య

పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. బిడ్డలు దూరంగా ఉండటం తట్టుకోలేని ఓ మాతృమూర్తి మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంది.

Palnadu : దూరంగా ఉన్న పిల్లలు…మానసిక ఒత్తిడితో తల్లి ఆత్మహత్య

Palnadu :  పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. బిడ్డలు దూరంగా ఉండటం తట్టుకోలేని ఓ మాతృమూర్తి మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం రామిరెడ్డి పేటకు చెందిన పోట్ల కుమారి (50), రామారావు దంపతులకు ముగ్గురు పిల్లలు. కుమారుడు హైదరాబాద్‌లో, పెద్ద కుమార్తె బెంగుళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న కుమార్తె మూడు నెలల క్రితం చదువుకునేందుకు అమెరికా వెళ్ళింది.

భార్యాభర్తలిద్దరూ నరసరావుపేటలో నివసిస్తున్నారు. పిల్లలు దగ్గర లేకుండా ఉండలేకపోతున్నా అని ఇటీవల కుమారి చిన్న కుమార్తెను విదేశాల నుంచి రావాలని కోరింది. చదువు పూర్తి చేసుకున్న తర్వాత వస్తానని చిన్న కూతురు చెప్పింది. దీంతో కుమారి తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెకు ఉన్న బంగారం ఆభరణాలు ధరించి, ఆస్తి పత్రాలు, ఇంట్లో ఉన్న నగదు నేలపై వేసి వాటిపై కూర్చుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు వ్యాపించడం గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే కుమారి పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. 1 టౌన్ సీఐ అశోక్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Murder Case : భర్తను ఎలా చంపాలి పుస్తక రచయిత్రి…భర్తను హత్య చేసిన కేసులో అరెస్ట్