Home » Author »chvmurthy
ఐటీ రంగంలో హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చి, నేడు ప్రపంచానికే తలమానికంగా ఉన్న మదాపూర్ లోని సైబర్ టవర్స్ నిర్మించి 21 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పలువురు ఐటీ ఇంజనీర్సు సోమవారం, సెప్టెంబర్ 23న వేడుకలు నిర్వహించారు. సైబర్ టవర్స్ వద్ద కేక�
ప్రముఖ ఔషధ సంస్ధ అరబిందో ఫార్మా ఆ సంస్ధ ప్రమోటర్లు , వీరితో సంబంధం ఉన్న అనుబంధ సంస్ధలపై సెబీ రూ. 22 కోట్ల జరిమానా విధించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘనతో ఈ చర్యతీసుకుంది. కంపెనీ, దాని ప్రమోటర్ పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి, ఆయన భార�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు విషయంలో మార్పులు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం పదవీ విరమణ వయస్సును రెండు రకాలుగా నిర్ధారించనున్నారు. (1)33 ఏళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్నవారు (2)60 ఏళ్ళ వ
హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌లో ఆదివారం అర్దరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ఒక జ్యూయలరీ షాపులో దోపిడీకి ప్రయత్నిస్తుండగా…అడ్డుకోబోయిన ఎస్సై పైకి కారు ఎక్కించి పరారయ్యారు. ఈ ఘటనలో దుండిగల్ ఎస్సై తృటిలో తప్పించుకున్నారు. అనంతరం పా�
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబిదుర్ రెహ్మాన్‌కు పాట్నా పోలీసులు జరిమానా విధించారు. మోటారు సైకిల్‌పై వెనుక వైపు కూర్చున్న రెహ్మాన్ ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో ఆయన రూ.1000 చలానా కట్టాల్సి వచ్చింది.
ఏపీ సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో…ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జరిగిన హత్యాయత్నం కేసు లో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ అధికారుల నుండి ప్రాణ హాని ఉందంటూ కుటుంబ సభ�
జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా లో విద్యార్దుల కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సెంటర్ ను ప్రారంభించింది. పుల్వామ అదనపు డిప్యూటీ కమిషనర్ మొహద్ అష్రఫ్ హకక్ కార్యాలయంలో ఈ సౌకర్యం కల్పించారు.
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను భద్రతా దళాలు సోమవారం భగ్నం చేశాయి. కథువా ప్రాంతంలోని దివాల్ గ్రామంలో 40 కిలోల భారీ పేలుడు పదార్దాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 29, ఆదివారం నుంచి శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు చెప్పా�
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మోటారు వాహాన చట్టం పట్ల వాహానదారులకు అవగాహాన కల్పించే దిశలో భాగంగా కర్ణాటక పోలీసులు వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. వాహానదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే విధంగా కొత్త నిబంధన అమల్లోకి తేనున్నారు.
తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. సెప్టెంబర్ 22 ఆదివారం బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలిపిన అనంతరం శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. శాసనమండలి సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగాయి. ఈ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మళ్లీ సమావేశమవుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపై వారు చర్చించనున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సెప్టెంబరు 23, సోమవారం ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్‌కు �
ఖమ్మం జిల్లాలో అదుపు తప్పిన కారు సాగర్ కాల్వలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 9 నెలల గర్భిణి సహ ఇద్దరు మరణించారు. జిల్లాలోని గొల్లగూడెం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. కారు కాల్వలోకి దూసుకెళ్తుండగా కార్లో ఉన్న పోగుల మహీప
తెలంగాణ శాసనసభ ఆదివారం నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 10 రోజులపాటు జరిగిన సమావేశాల్లో 3 బిల్లులు. ఒక తీర్మానాన్ని ఆమోదించారు. 10 రోజుల పాటు జరిగిన సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. ఆ�
రాష్ట్రంలో కౌలుదారులను గుర్తించే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రైతుల భూమి కాపాడతామని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ‘ద్రవ్య వినిమయ బిల్లు’ను ప్రవే�
విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఏజెన్సీలోని జీకే వీధి మండలం మాదిగ మల్లులోని ధారకొండ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. సెప్టెంబర్ 21 నుం
అనుమతుల్లేకుండా విదేశీయులు భారత్ లో నివసించే హక్కు లేదని హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ అన్నారు. జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ)ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ప్రకటించిన హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ ఇవాళ మరింత ఘాటుగా స్పందించార�
ఎగువున కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.32 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో కూడా 1.32 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్ర�
హైదరాబాద్ మహానగరంలో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నగరానికి మంచినీరు అందించే కృష్ణా ఫేస్-3 పైపు లైనుకు పలుచోట్ల ఏర్పడ్డ లీకేజీలకు జలమండలి అధికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు. ఇందుకోసం సెప్టెంబరు 23 సోమవారం ఉదయం 6 గం�
ఉత్తర ప్రదేశ్ లోని మిరేచి పట్టణంలో శనివారం ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. శిధిలాల కిందపడి ఆరుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రాకు 100 కిలోమీటర్ల దూరంలోని ఏత్ జిల్లాలోని మిరేచి