హాస్పిటల్ లో పందులు…నెలలో 100మంది శిశువులు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : January 2, 2020 / 09:59 AM IST
హాస్పిటల్ లో పందులు…నెలలో 100మంది శిశువులు మృతి

రాజస్థాన్ లోని కోట ప్రభుత్వ హాస్పిటల్ లో పరిస్థితి దారుణంగా మారింది. కోట సిటీలోని జేకే లొన్ ప్రభుత్వ హాస్పిటల్ లో కేవలం ఒక్క నెలలోనే 100మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కోట హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారరంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్న స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై కూడా దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

రాజస్థాన్ రాజధాని జైపూర్ కి 251కిలోమీటర్ల దూరంలోని కోట హాస్పిటల్ లో 2019డిసెంబర్ నెల చివరి రెండు రోజుల్లో తొమ్మిది మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. తక్కువ బరువుతో పుట్టడమే వీళ్ల మరణానికి కారణమని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ తెలిపారు. శిశు మరణాలపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సమయంలో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(NCPCR)టీమ్ హాస్పిటల్ లో పర్యటించింది. హాస్పిటల్ క్యాంపస్ లోపల పందులు తిరగడం, విరిగిపోయిన తలుపులు,గేట్లు, అవసరమైనదానికన్నా తక్కువమంది స్టాఫ్ మంది ఉండటం వంటివి హాస్పిటల్ లో తనీఖీల సమయంలో NCPCR టీమ్ గుర్తించిన వాటిలో ఉన్నాయి.

మరోవైపు రాజస్థాన్ రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ నేతృత్వంలో ఓ టీమ్ కూడా కోట హాస్పిటల్ లో పర్యటించి…ఇంక్యుబేషన్ యూనిట్ లో లోపాలను కనుగొంది. ఇంక్యుబేషన్ యూనిట్లు సరిగా పనిచేయడం లేదని వారు తెలుసుకున్నారు. కొరత కారణంగా ఇద్దరు శిశువులను ఒక ఇంక్యుబేటర్‌లో హాస్పిటల్ ఉంచినట్లు వారు గుర్తించారు. అయితే రాజస్థాన్ గవర్నమెంట్ కమిటీ మాత్రం ఈ వారం ప్రారంభంలో హాస్పిటల్ అధికారులకు క్లీన్ చిట్ ఇవ్వడం,శిశువులకు సరైన ట్రీట్మెంట్ హాస్పిటల్ ఇస్తున్నారని చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

చిన్నారులపై మరణాలపై కోట ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఓం బిర్లా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పట్ల తీవ్రంగా ఆలోచించి చిన్నారుల మరణాలను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చిన్నారుల మరణాల విషయమై ఈ వారం ప్రారంభంలో బీజేపీ ఓ ప్యానల్ ఏర్పాటు చేసింది. ఇద్దరు నుంచి ముగ్గురు చిన్నారుల వరకు ఒక బెడ్ పై హాస్పిటల్ లో ఉంచబడినట్లు గుర్తించినట్లు బీజేపీ ప్యానల్ తెలిపింది. హాస్పిటల్ లో తగినంతమంది నర్సులు కూడా లేరన్నారు. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ప్రకారం రాజస్థాన్‌లో సగటు శిశు మరణాల రేటు చాలా ఎక్కువ. 1000మంది జన్మిస్తే అందులో 38మంది శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆ డేటా తెలిపింది.