ఫామ్ హౌస్ లో అమ్మాయిల కోసం గొడవ : 159 మంది అరెస్టు

  • Edited By: chvmurthy , May 5, 2019 / 02:18 PM IST
ఫామ్ హౌస్ లో అమ్మాయిల కోసం గొడవ : 159 మంది అరెస్టు

తమిళనాడు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని పొల్లాచి  సెక్స్ రాకెట్ కేసు విచారణలో ఉండగానే…….అదే ఫామ్ హౌస్ లలో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసారు. పొల్లాచి  సమీపంలోని సేతముడై ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేసి 159  మంది యువకులను అరెస్టు చేశారు. డ్రగ్స్ మత్తులో తూలుతున్న వీరిలో  సుమారు 90 మంది కేరళకు చెందిన విద్యార్ధులు, యువత ఉన్నారు. శుక్రవారం రాత్రి నుంచి  శనివారం ఉదయం వరకు ఫామ్ హౌస్ లో డ్రగ్స్ మత్తులో డీజే సౌండ్ లో డ్యాన్స్ చేస్తూ..చిందేస్తూ ఎంజాయ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీ లో పాల్గోనేందుకు ఆర్గనైజర్లు ఒక్కోక్కరి  వద్ద నుంచి 12 వందల రూపాయలు వసూలు చేసారు. నిర్వాహాకులు రేవ్ పార్టీ గురించి ఇన్స్టాగ్రాం, సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేసినట్లు పోలీసులు తెలిపారు.  

పార్టీలో మహిళల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా, రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. డీజే సౌండ్, విద్యార్ధుల ఘర్షణతో గ్రామస్తులకు ఇబ్బంది కలగటంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఫామ్ హౌస్ కు చేరుకున్న పోలీసులు యువకులను, విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ నుంచి పెద్దఎత్తున డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ మేనేజర్లను, ఆర్గనైజర్లను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ఇంటర్నేషనల్ కొకైన్ గ్యాంగ్ ముఠా సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ ఘటన తర్వాత కొయంబ్తతూరు పోలీసులు పొల్లాచి సమీపంలోని అన్ని ఫామ్ హౌస్ లలో సోదాలు నిర్వహించారు.