Girl Gang-Raped : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం.. మంచి నీళ్ల కోసం వెళ్లిన బాలికపై గ్యాంగ్ రేప్

ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగు చూసింది. పది రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు.

Girl Gang-Raped : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం.. మంచి నీళ్ల కోసం వెళ్లిన బాలికపై గ్యాంగ్ రేప్

girl gang raped

Girl Gang-Raped : ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగు చూసింది. పది రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. కాట్రేనికోన మండలంలో ఫిబ్రవరి 6న బాలికపై సమూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పది రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

చిర్రయానం గ్రామంలో చెడుగుడు తోటలోకి బాలికను తీసుకెళ్లిన ఐదుగురు యువకులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఫిబ్రవరి 6న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మంచి నీళ్ల కోసం బాలిక బావి దగ్గరికి వెళ్లింది. అదే ప్రాంతానికి చెందిన మేజర్లైన ఐదుగురు యువకులు ఆ బాలికను పక్కనే ఉన్న చెడుగుడు తోటలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6న జరిగిన ఘటన ఫిబ్రవరి 16వరకు వెలుగులోకి రాలేదు.

Minor Gang Raped : దారుణం.. మైనర్ బాలికపై 8మంది గ్యాంగ్ రేప్.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్

అయితే, చిర్రయానంకు సంబంధించిన పెద్దలు దీన్ని కప్పిపుచ్చేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేశారు. కానీ, బాలిక తండ్రి ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని నిరాకరించడంతో ఎట్టకేలకు పది రోజుల తర్వాత పోలీసులు పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఐదుగురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.