జాతకాల పేరుతో జ్యోతిష్యుడు దోపిడీ : యువతి నుంచి రూ. 5 లక్షలు వసూలు 

విజయవాడలో జాతకాల పేరుతో ఓ జ్యోతిష్యుడు దోపిడీ చేశాడు. పూజలు చేసి జాతర దోషాలు తొలగిస్తామని మోసానికి పాల్పడ్డాడు.

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 09:27 AM IST
జాతకాల పేరుతో జ్యోతిష్యుడు దోపిడీ : యువతి నుంచి రూ. 5 లక్షలు వసూలు 

విజయవాడలో జాతకాల పేరుతో ఓ జ్యోతిష్యుడు దోపిడీ చేశాడు. పూజలు చేసి జాతర దోషాలు తొలగిస్తామని మోసానికి పాల్పడ్డాడు.

విజయవాడలో జాతకాల పేరుతో ఓ జ్యోతిష్యుడు దోపిడీ చేశాడు. పూజలు చేసి జాతర దోషాలు తొలగిస్తామని మోసానికి పాల్పడ్డాడు. ఓ యువతి నుంచి రూ. 5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. పూజలు వల్ల ఫలితం లేకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని యువతి కోరింది. డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు దిగాడు. దీంతో యువతి కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు. 

విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని అయోధ్యనగర్‌లో నివాసం ఉంటున్న పరిమి సాయిప్రియాంకకు తండ్రి మరణించాడు. తల్లితో కలిసి ఉంటోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నా కలిసి రాకపోవడంతో ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించాలని ప్రియాంకకు పలువురు సూచించారు. దీంతో కృష్ణలంక పాతపోస్టాఫీసు రోడ్డు బియ్యపుకొట్ల బజారులో ఉండే శ్రీశారద సనత్‌చంద్ర అనే జ్యోతిష్యుడిని కలిసి తన సమస్య చెప్పుకుంది. ఆమె జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యుడు పలు దోషాలున్నాయని చెప్పి శాంతిపూజ జరిపించాలన్నాడు. ఇందుకోసం (సెప్టెంబర్‌ 23, 2019) ఆమె నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. 

కొన్ని పూజలు చేసిన అనంతరం తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్న ఓ అమ్మవారి గుడిలో పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పి మరో రూ.2.82 లక్షలు తీసుకుని ఆమెను అక్కడికి తీసుకువెళ్లాడు. ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయించి పంపేశాడు. అంతేకాకుండా ముగ్గురు ముత్తయిదువులకు దానం చేస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటూ తన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళతోపాటు తన కుటుంబీకులు మరో ఇద్దరికి రూ.70 వేలు ఇప్పించాడు. ఆ తర్వాత మరో పూజ చేయాలని, ఇందుకు మరో లక్ష అవుతుందని చెప్పాడు.

తన దగ్గర డబ్బు లేదని చెప్పడంతో ఈ పూజ చేయకుంటే ఇప్పటి వరకు చేసిన పూజ వ్యర్థమవుతుందని చెప్పి అప్పు ఇప్పిస్తానంటూ సిద్ధ పడ్డాడు. ఇందుకోసం చెక్‌లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని ఎటువంటి పూజలు చేయంచకుండా ముఖం చాటేశాడు. ఆమె ఫోన్‌ చేస్తే అసభ్యంగా తిడుతూ, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు మొదలు పెట్టాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన యువతి శనివారం (డిసెంబర్ 7, 2019) కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది.