Delhi: నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

ఉత్తర ఢిల్లీ శివారులోని భల్స్వా ప్రాంతంలో గత బుధవారం నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. కార్మికుడి కుటుంబానికి చెందిన చిన్నారి, తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా కిడ్నాపైంది. రాత్రి వరకు పాప కనిపించకపోవడంతో పాప తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Delhi: నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

Delhi: ఢిల్లీలో గత వారం నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఉత్తర ఢిల్లీ శివారులోని భల్స్వా ప్రాంతంలో గత బుధవారం నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. కార్మికుడి కుటుంబానికి చెందిన చిన్నారి, తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా కిడ్నాపైంది. రాత్రి వరకు పాప కనిపించకపోవడంతో పాప తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా

పోలీసులు పాప మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరసటి రోజు ఉదయం దగ్గర్లోని ఒక పార్కు వద్ద పాప కనిపించింది. అప్పటికే అనారోగ్యకర స్థితిలో ఉన్న పాపను గుర్తించి, తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పాపను పరీక్షించిన వైద్యులు చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు దీనిపై విచారణ జరిపారు. అత్యాచార నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాల్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఈ ప్రాంతంలోని సెక్యూరిటీ కెమెరాల్ని పరిశీలించగా, అనిల్ పాఠక్ అనే నిందితుడు పాపను ఎత్తుకెళ్లడం గమనించారు. దీంతో నిందితుడి కోసం గాలించారు.

సోమవారం రాత్రి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ మహిళా హక్కుల కమిషన్ స్పందించింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసుల్ని ఆదేశించింది.