DCP Sneha Mehra : సోషల్ మీడియా, యూట్యూబ్ లో కించపరిచేలా పోస్టింగ్ లు, ట్రోల్ చేస్తే కఠిన చర్యలు : సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా

సోషల్ మీడియా, యూట్యూబ్ లో కించ పరిచేలా పోస్టింగ్ లు పెడితే చర్యలు తప్పవని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు, సినిమా ఇండస్ట్రీ, మహిళలను కించ పరిచేలా ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.

DCP Sneha Mehra : సోషల్ మీడియా, యూట్యూబ్ లో కించపరిచేలా పోస్టింగ్ లు, ట్రోల్ చేస్తే కఠిన చర్యలు : సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా

DCP Sneha Mehra

DCP Sneha Mehra : సోషల్ మీడియా, యూట్యూబ్ లో కించ పరిచేలా పోస్టింగ్ లు పెడితే, ట్రోల్ చేస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు, సినిమా ఇండస్ట్రీ, మహిళలను కించ పరిచేలా ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు డీసీపీ స్నేహా మెహ్రా హైదరాబాద్ లో 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితపై కూడా అసభ్యంగా, కించ పరిచేలా ట్రోల్ చేస్తున్న చానెల్స్ పై 20 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో 8 మందికి 41 A నోటీసులు ఇచ్చామని చెప్పారు.

పదో రోజుల పాటు ఈ కేసులో విచారణ చేసి వారిని పట్టుకున్నామని పేర్కొన్నారు. వ్యూస్ పెంచుకోవడం, డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని తెలిపారు. చెవిలో పువ్వు, టీమ్ ఆఫ్ ట్రోలింగ్ బంతి పువ్వు ట్రోలింగ్.. తెలుగు ట్రోల్స్ న్యూ, ట్రోలర్ కుర్రాడు, యాంకమ్మ ట్రోల్స్ అనే యుట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్ లో కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసత్య ట్రోల్స్ చేసిన 20 మందిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

Children’s Image Rights : తల్లిదండ్రుల్లారా తస్మాత్ జాగ్రత్త.. మీ పిల్లల ఫొటోలను ఇకపై సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు.. ఎందుకో తెలుసా?

సోషల్ మీడియాలో ప్రజా ప్రతినిధులపై అసత్య ప్రచారం చేస్తూ ట్రోల్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. మహిళలను కించపరిచే విధంగా పలు సోషల్ మీడియా నిర్వాహకులు ట్రోలింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితపై ఈ మధ్య ఎక్కువ ట్రోలింగ్ జరిగాయని గుర్తించామని తెలిపారు. ఎమ్మెల్సీ కవితపై కించపరిచే విధంగా, అభ్యుస్, వల్గర్ గా ట్రోల్ చేశారని దీంతో పాటు మహిళలపై అత్యధికంగా ట్రోల్స్ జరుగుతున్నాయని గుర్తించామని చెప్పారు.

ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంత మంది ప్రజా ప్రతినిధులపై ట్రోల్స్ జరుగుతున్నాయని వెల్లడించారు. టీఆర్పీ, సబ్ స్క్రైబర్స్, వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కువ మంది యువత ఈ ట్రోలింగ్ కి పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే 20 మందిపై కేసులు నమోదు చేసి.. 8 మందికి 41 సీఅర్ పీసీ నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.

Dangerous Stunt : వీడి సోషల్ మీడియా పిచ్చి పాడుకాను.. నేషనల్ హైవేపై ఆ పని చేసి అరెస్ట్ అయ్యాడు, వీడియో వైరల్

ప్రధానంగా మహిళలను కించపరిచే విధంగా ట్రోల్స్, మీమ్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది యువత తమ సబ్‌స్క్రైబర్‌లను పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో కొంతమంది ప్రజా ప్రతినిధులపై మార్ఫింగ్ చేసిన వీడియోలు, అవమానకరమైన కంటెంట్‌ను ట్రోలింగ్ ఛానల్ పోస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఆ ట్రోలింగ్ ఛానెల్స్ కు సైబర్ క్రైం పోలీసులు 41(ఎ) సీ ఆర్ పీసీ నోటీసులు జారీ చేశారు.

ట్రోలింగ్ ఛానెల్స్ & యజమాని పేర్లు
1) TrollerKurradu @trollerkurradu4308
అట్టాడ శ్రీనివాసరావు (విజయనగరం)
2) SirasaniManikanta (Cuddapah)
శ్రీ. మాసబ్బాయి @MrMassabbayi
3) యంకమ్మ టోల్స్
తెలుగు ట్రోలు కొత్తవి
బద్దంజ్ శ్రావణ్ (నిజామాబాద్)
4) Motam Srinu (Warangal)
చిమ్తు ట్రోల్స్
5) పెరకనాగవెంకట జ్యోతి కిరణ్ (కృష్ణ)
వడ్లూరి నవీన్ (జగిత్యాల)
6) Team of Trolling Banthipuvvu Trolls
బొల్లి చంద్రశేఖర్ (కరీంనగర్)
7) Chandu Trolls
చెవిలోపువ్వు
8) Billa Srikanth (Cuddapah)