మోడల్‌పై అత్యాచారం: 55ఏళ్ల డాక్టర్ అరెస్ట్

మోడల్‌పై అత్యాచారం: 55ఏళ్ల డాక్టర్ అరెస్ట్

ప్రాణమిచ్చేది భగవంతుడైతే.. ప్రాణాన్ని నిలబెట్టేది వైద్యుడు. అందుకే డాక్టర్లంటే ప్రత్యేకమైన గౌరవం. జబ్బులపై అధిక ఫీజులు చేసినా వాళ్లనే నమ్మి చికిత్స చేయించుకుంటున్న అమాయక ప్రజలపై రెచ్చిపోతున్నారు. మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలో 21ఏళ్ల ప్రముఖ మోడల్, సీరియల్ నటిపై అత్యాచారానికి ఒడిగట్టాడు 55ఏళ్ల డాక్టర్. 

బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.  2017లో చర్మ సమస్య కారణంగా ఓ ఫ్రెండ్ చెప్పడంతో ఆ వైద్యుడి దగ్గరకు వెళ్లింది నటి. ఆమె సమస్యలు అడిగి తెలుసుకున్న డాక్టర్.. పలు ఫొటోలు తీశాడు. వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం వెర్సొవా పోలీసులను సంప్రదించిన మహిళ కేసు పెట్టింది. 

డాక్టర్‌ను ఆదివారమే అదుపులోకి తీసుకున్న పోలీసులు మే10వరకూ రిమాండ్‌లోనే ఉంచుకుని తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదును బట్టి మరిన్ని సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు.