ప్రేయసి కోసం ఒంటెను దొంగిలించిన ప్రియుడు …. ప్రేమికులు అరెస్ట్

ప్రేయసి కోసం ఒంటెను దొంగిలించిన ప్రియుడు …. ప్రేమికులు అరెస్ట్

Dubai lover arrested for steal rare new born camel : సాధారణంగా తన ప్రేయసి పుట్టిన రోజైతే ఎవరైనా గూలాబీలు చాక్లెట్లు, గోల్డ్ రింగ్, లేదా తన ప్రేయసికి నచ్చిన వస్తువులు ఇస్తూ ఉంటారు. కానీ అవన్నీ రొటీన్ అనుకున్నాడోఏమో ఒక ప్రేమికుడు తన ప్రేయసికి ఒంటె పిల్లను బహుమతిగా ఇచ్చాడు. అదీ కొనుకొచ్చి ఇచ్చి ఉంటే బాగుండేది. దొంగతనం చేసి తీసుకొచ్చి ఒంటె పిల్లను ఇచ్చాడు. ఒంటెపిల్ల కనపడటంలేదని దాని యజమాని ఫిర్యాదు చేయటంతో పోలీసులు ప్రేయసి ప్రియులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటన దుబాయ్ లో జరిగింది.

దుబాయ్ లో ఉండే ప్రేమికుడు తన ప్రియురాలి పుట్టినరోజున వెరైటీ గా ఉండాలని ఒంటెని బహుమతిగా ఇద్దామనుకున్నాడు. దాన్ని కొనలేక ఒక ఒంటెను దొంగతనం చేయటానికి వెళ్లాడు. ఈ సమయంలో దానియజమానులు అక్కడికి వచ్చే సరికి దాని పక్కనే ఉన్న ఒంటె పిల్లను దొంగతనం చేసి తీసుకువచ్చి ప్రియురాలికి పుట్టినరోజు బహుమతిగా ఇచ్చాడు. తర్వాతి క్రమంలో దాని యజమాని తన ఒంటె పిల్ల కనిపించటంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు ఒంటెపిల్ల కోసం గాలింపు చేపట్టారు.

అరబ్ దేశాల్లలో చాలా కుటుంబాలు పోషణకోసం ఒంటెలను పెంచుతుంటాయి, మనదేశంలో గెదెలు, ఆవులను పెంచినట్లు వాళ్లు ఒంటెలన పెంచుతారు,పాలు ఇతర అహార ఉత్పత్తుల కోసం వారు కొట్టాలు వేసి ఒంటెలను పెంచుతుంటారు. రేసుల కోసంకూడా ఒంటెలను పెంచుతుంటారు, ఈ క్రమంలో పోలీసులు ఒంటె పిల్లకోసం గాలింపు చేపట్టినట్లు తెలుసుకున్న ప్రియుడికి వెన్నులో వణుకు మొదలైంది.

దీంతో ఒంటె పిల్లను ఎక్కడ్నించి దొంగతనం చేసి తీసుకువచ్చాడో దానికి మూడు కిలోమీటర్ల దూరంలో దానిని వదిలి పెట్టివచ్చాడు. అనంతరం తానే పోలీసులకు ఫోన్ చేసి ఫలానా ప్రాంతంలో ఒంటెపిల్ల కొన్నాళ్లుదా ఆ ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతోందనే సమాచారం ఇచ్చాడు. ఆ ఫోన్ నెంబరు ఆధారంగా కేసు ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయగా తానే ఒంటె పిల్లను దొంగిలించానని ఒప్పుకున్నాడు. కేసు నమోదుచేసిన పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు,