పెళ్లిఇంటి వద్ద హిజ్రాల అరాచకం : 10 మంది అరెస్ట్

పెళ్లిఇంటి వద్ద హిజ్రాల అరాచకం : 10 మంది అరెస్ట్

Eight members of hijras gang arrested  : హైదరాబాద్ లో హిజ్రాల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది.ఏదైనా షాప్ ఓపెనింగ్ అయినా..ఇంట్లో శుభకార్య జరుగుతున్నా దాదాపు 10 మంది దాకా వచ్చి హడావిడి … గోల చేసి వారి వద్ద నుంచి వేల రూపాయలు వసూలు చేసుకుని వెళ్ళటం పారిపాటి అయ్యింది. వారు అడిగినంత ఇచ్చుకోకపోతే వారుచేసే వికృత చేష్టలకు నలుగురిలో పరువు పోయేలా చేస్తున్నారు. వారి చేష్టలకు భయపడి, వాళ్లతో గొడవపడలేక… వారు అడిగనంత ఇచ్చి వారిని వదిలించుకుంటున్నారు ప్రజలు. ఇదే క్రమంలో హిజ్రాల బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో బాచుపల్లి పోలీసులు 8 మంది హిజ్రాలను, ఇద్దరు ఆటోడ్రైవర్లను అరెస్ట్ చేశారు.

ప్రగతి నగర ఆర్కే లేఅవుట్ లో నివాసం ఉండే పంచాంగం చలపతి డిసెంబర్24న తన కుమారుడి వివాహం చేశారు. 25న నవ దంపతులతో సత్యనారాయణస్వామి వ్రతం చేసుకుంటుండగా ఆ ఇంటివద్దకు వచ్చిన 8 మంది హిజ్రాలు వారి వికృత చేష్టలతో నానా హైరానా చేశారు. రూ. 20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవటంతో అసభ్య పదజాలంతో దూషిస్తూ…. పెద్దపెద్దగా కేకలు వేస్తూ ఇంటి వద్ద నానా హంగామా చేశారు. మొత్తానికి వారికి రూ.16,500 ఇవ్వటంతో వారు వచ్చిన ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లి ఆటో నెంబర్ టీఎస్‌ 15యూడీ 0298 ఆధారంగా చలపతి రావు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు , శనివారం 8 మంది హిజ్రాలను ఆటోతో సహా ఆల్విన్ క్రాస్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో  సాక్షి అలియాస్‌ సహాన(ఏ1), మల్కాపూర్‌ రాకే్‌ష(ఏ2), మునావత్‌ రాకేష్‌ (ఏ3), రాములు గగనం(ఏ4), బప్పర బాబయ్య(ఏ5), తురపతి నర్సింహులు(ఏ6), తురపతి లింగం(ఏ7), తురపతి యాదయ్య(ఏ8) ఆటో డ్రైవర్లు కరణ్‌ గుప్తా(ఏ9), మహ్మద్‌ మసి(ఏ10)లు గా కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి 7సెల్‌ఫోన్లు, రూ.16,500 నగదును పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. హిజ్రాలు ఎవరైనా ఇంటివద్దకు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తే… వెంటనే 100కు డయల్‌ చేయడం, లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ సురేందర్‌రావు ప్రజలకు తెలిపారు.