గన్‌తో సెల్ఫీ..

గన్‌తో సెల్ఫీ..

Selfie with Gun: గన్‌తో సెల్ఫీ తీసుకుంటూ.. ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. సౌరబ్ అనే వ్యక్తి స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడి దగ్గరకు వెళ్లబోతుండగా ఈ ఘటన జరిగింది. బిస్రాఖ్ పోలీసులకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు.

‘బిస్రాఖ్ పోలీస్ స్టేషన్ అధికారులకు ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటుండగా గాయపడినట్లు సమాచారం వచ్చింది. సిటీ టౌన్ వద్ద ఘటన జరిగినట్లు తెలియడంతో అక్కడివి వెళ్లాం. ట్రీట్‌మెంట్ తీసుకుంటుండగానే వ్యక్తి మరణించాడు. యాక్సిడెంటల్ డెత్‌గానే పరిగణిస్తున్నాం’ అని అంకుర్ అగర్వాల్ అన్నారు.



ఇద్దరు వ్యక్తులు కలిసి ఫ్రెండ్ కోసం బయల్దేరారు. ముగ్గురు కలిసి ఓ పెళ్లి విందుకు అటెండ్ కావాల్సి ఉంది. బంధువుకు సంబంధించిన కారులో సౌరబ్, నకుల్ ఆచ్చెరా గ్రామం నుంచి 3గంటల సమయంలో స్టార్ట్ అయ్యారు. సౌరబ్ తన తండ్రి గన్ తీసుకుని పాయింట్‌లో పెట్టుకుని సెల్ఫీలు దిగడం మొదలుపెట్టాడు.

గన్ లోడ్ అయి ఉందని, సేఫ్టీ వాల్వ్ ఓపెన్‌గా ఉన్నట్లు గ్రహించలేదు. గన్ పేలి ఛాతీ దగ్గరలో ప్రమాదం జరిగింది. శారదా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటుండగా మృతి చెందాడు. ప్రాథమిక విచారణలో నకుల్ ను అనుమానించిన పోలీసులు ప్రశ్నించి వదిలేశారు. మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.