Jammu And Kashmir : జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్-ఉగ్రవాది మృతి

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో నిన్న రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో  ముజాహిదీన్ ఉగ్రవాద సంస్ధకు చెందిన కమాండర్ మృతి చెందాడు.

Jammu And Kashmir : జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్-ఉగ్రవాది మృతి

JK Encounter

Jammu And Kashmir :  జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో నిన్న రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో  ముజాహిదీన్ ఉగ్రవాద సంస్ధకు చెందిన కమాండర్ మృతి చెందాడు. దక్షిణ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా, రిషిపోర గ్రామం కప్రాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆర్మీ, స్ధానిక పోలీసులు శుక్రవారం సాయంత్రం కార్డన్ సెర్చ్ ప్రారంభించారు.

నిన్న అర్ధరాత్రి సమయంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్న ఇంటిని భద్రతా దళాలు చుట్టుముట్టగా    ఉగ్రవాదులకు, సెర్చింగ్ పార్టీకి మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు సైనికులకు గాయాలు కాగా, హిజ్బుల్-ఉల్-ముజాహిదిన్ ఉగ్రవాద సంస్ధకు చెందిన కమాండర్ నిసార్ ఖండే మరణించాడు.

ఉగ్రవాది నుంచి ఒక ఏకే-4 రైఫిల్ తో సహా పేలుడు పదార్ధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని  కశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు విజయకుమార్ ట్వీట్ చేశారు.  ఘటనా స్ధలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, ఆపరేషన్ పూర్తయ్యాక మృతులు సంఖ్య చెపుతామని పోలీసులు తెలిపారు.

Also Read : Group-1 Application: నేటితో గ్రూప్-1 దరఖాస్తులకు చివరి గడువు.. రాత్రి ఎన్ని గంటల వరకు అంటే..