Nude Photos : అమ్మాయిలూ.. సోషల్ మీడియాతో జాగ్రత్త.. అమ్మాయి అడిగిందని ఫొటోలు పంపారో.. ఇక అంతే..

అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వారిని తన మాయమాటలతో నమ్మించాడు. క్లోజ్ ఫ్రెండ్ లా వారికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఫోటోలు పంపించమని అడిగాడు.

Nude Photos : అమ్మాయిలూ.. సోషల్ మీడియాతో జాగ్రత్త.. అమ్మాయి అడిగిందని ఫొటోలు పంపారో.. ఇక అంతే..

Nude Photos Social Media

Nude Photos : హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ కామాంధుడిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలను వేధిస్తున్న పాలకుర్తి అజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. చాలామంది అమ్మాయిలు ఈ కామాంధుడి చేతిలో మోసపోయినట్టు పోలీసుల విచారణలో తేలింది.

పాలకుర్తి అజయ్ ఇన్ స్టాగ్రామ్ లో అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వారిని తన మాయమాటలతో నమ్మించాడు. క్లోజ్ ఫ్రెండ్ లా వారికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఫోటోలు పంపించమని అడిగాడు. అడుగుతున్నది అమ్మాయే కాదా.. ఫొటోలు పంపితే ఏమవుతుందిలే.. అనుకుని.. చాలామంది ఫోటోలు పంపేశారు.

Bharat Bandh : డిసెంబర్ 31 వరకు భారత్ బంద్..? నిజమెంత

అంతే.. కట్ చేస్తే.. అజయ్ తన విశ్వరూపం చూపించాడు. వారికి నరకం చూపించాడు. ఆ ఫొటోలు అడ్డం పెట్టుకుని అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. న్యూడ్ ఫోటోలు పంపించకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి స్నేహితులకు, బంధువులకు పంపిస్తానని బెదిరింపులకు దిగాడు ఆ కీచకుడు. న్యూడ్ ఫోటోలు పంపించడమే కాదు తన కోరిక తీర్చాలని లేదంటే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని టార్చర్ పెట్టాడు. ఇలా ఎందరో అమ్మాయిలు అజయ్ వలలో చిక్కారు. బయటకు చెబితే పరువు పోతుందని భయపడి మౌనంగా వేధింపులు భరించారు.

కాగా, ఓ అమ్మాయి అజయ్ వేధింపులు భరించలేక తన న్యూడ్ ఫొటోలు పంపింది. వాటిని అడ్డం పెట్టుకుని తన కోరిక తీర్చాలని వేధించడం స్టార్ట్ చేశాడు అజయ్. వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. కామాంధుడు అజయ్ కోసం వెతికారు.

Jaggery : బెల్లం అతిగా తింటున్నారా…అయితే జాగ్రత్త?..

ఎట్టకేలకు 15 రోజుల తర్వాత కామాంధుడు అజయ్ పోలీసులకు చిక్కాడు. దిల్ సుఖ్ నగర్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అజయ్ ది వరంగల్ జిల్లా పరకాల అని, మల్టీ మీడియా చదువుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. మరికొంత మంది అమ్మాయిలను వేధించినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.