Kadapa Politics: ప్రొద్దుటూరు వైసీపీలో తారాస్థాయికి చేరిన వర్గపోరు

ప్రొద్దుటూరు వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ మధ్య ఆధిపత్య పోరు.. వర్గపోరుగా మారింది.

Kadapa Politics: ప్రొద్దుటూరు వైసీపీలో తారాస్థాయికి చేరిన వర్గపోరు

Politics

Kadapa Politics: కడప జిల్లా ప్రొద్దుటూరులో మరోసారి రాజకీయ వైరుధ్యం రచ్చకెక్కింది. ప్రొద్దుటూరు వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ మధ్య ఆధిపత్య పోరు.. వర్గపోరుగా మారింది. దీంతో ప్రొద్దుటూరు రాజకీయాలు ఎమ్మెల్యే వెర్సెస్ ఎమ్మెల్సీగా మారింది. గురువారం అర్ధరాత్రి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అనుచరులు… ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అనుచరుల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. ఈ దాడుల్లో ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ అనుచరుడు రఘునాథరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడులతో ప్రొద్దుటూరులో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.

Also Read: Baby Rescued: మైనస్ డిగ్రీల చలిలో చావు బ్రతుకుల మధ్య పసికందు లభ్యం

మరో రెండు రోజుల్లో ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు ప్రొద్దుటూరులో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా ఈఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఫోటో లేకపోవడంపై శివప్రసాద్‌రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎమ్మెల్సీ వర్గీయులపై దాడికి దిగారు. 10వ వార్డు కౌన్సిలర్‌ గరిశపాటి లక్ష్మిదేవి భరత్‌, వేణుగోపాల్, కసిరెడ్డి మహేశ్‌రెడ్డితోపాటు మరికొంత మంది తమపై దాడికి పాల్పడినట్టు ఎమ్మెల్సీ అనుచరులు ఆరోపించారు. ఇదిలాఉంటే ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌… తమను గన్‌తో బెదిరించారని.. కౌన్సిలర్‌ లక్ష్మిదేవి భరత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read: Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మృతి

దీనిపై శుక్రవారం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ స్పందిస్తూ తనకు లైసెన్స్‌డ్ గన్‌ ఉన్న మాట వాస్తవమేనని అయితే దాన్ని ఇంతవరకు ఉపయోగించలేదని స్పష్టం చేశారు. తనకు ప్రభుత్వం గన్‌మెన్‌ను కేటాయించిందని చెప్పారు. తన అనుచరులపై దాడి జరుగుతోందని సమాచారంతో సంఘటనా ప్రదేశానికి వెళ్లానే తప్పా… తాను ఎవరినీ బెదిరించలేదని రమేష్ యాదవ్ అన్నారు సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడుతానని రమేష్ యాదవ్ 10టీవీ ప్రతినిధితో అన్నారు. అయితే ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌కు తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. వీధిలో జరిగిన చిన్న గొడవను పెద్దదిగా చేస్తున్నారని, పనిగట్టుకుని కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు మండిపడ్డారు.

Also read: UP SP : సైకిల్ బలంగా ఉంది – అఖిలేష్..ఎస్పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య