నా చెల్లి, బావ ఎలా చనిపోయారో తెలీదు : పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్

తన సోదరి, ఆమె భర్త, కూతురు మృతిపై పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పందించారు. జనవరి 27న సాయంత్రం కరీంనగర్ నుంచి తన సోదరి, బావ వారి కూతురు కారులో

  • Published By: veegamteam ,Published On : February 17, 2020 / 05:53 AM IST
నా చెల్లి, బావ ఎలా చనిపోయారో తెలీదు : పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్

తన సోదరి, ఆమె భర్త, కూతురు మృతిపై పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పందించారు. జనవరి 27న సాయంత్రం కరీంనగర్ నుంచి తన సోదరి, బావ వారి కూతురు కారులో

తన సోదరి, ఆమె భర్త, కూతురు మృతిపై పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పందించారు. జనవరి 27న సాయంత్రం కరీంనగర్ నుంచి తన సోదరి, బావ వారి కూతురు కారులో బయటకు వెళ్లారని చెప్పారు. అప్పటి నుంచి వారి ఫోన్ కలవలేదన్నారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేసినా సమాచారం దొరకలేదన్నారు. వారంతా క్షేమంగా ఉన్నారని అనుకున్నామని ఎమ్మెల్యే అన్నారు. సోదరి కుటుంబం మిస్సింగ్ పై ఆందోళనలో ఉన్నామని చెప్పారు. ఇంతలో ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందని వాపోయారు. 

తన సోదరి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవన్నారు. వారి కుటుంబంలో ఎలాంటి గొడవలు కూడా లేవన్నారు. అసలేం జరిగిందో తనకూ తెలియదన్నారు. తన సోదరి కుటుంబం తరుచూ విహార యాత్రలకు వెళ్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. తన సోదరి కొడుకు మూడేళ్ల క్రితం కారు ప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్యే తెలిపారు. చెల్లెలు, బావ వారి కూతురు మృతితో ఎమ్మెల్యే దాసరి మనోహర్ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి.

సోమవారం(ఫిబ్రవరి 17,2020) కరీంనగర్ జిల్లా అలగనూర్ కాకతీయ కాల్వలో కారు కొట్టుకొచ్చింది. అందులో మూడు మృతదేహాలు ఉన్నాయి. కాల్వలో కారు, అందులో మృతదేహాలు ఉండటం సంచలనం రేపింది. వారిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంధువులుగా పోలీసులు గుర్తించడం మరింత సంచలనమైంది. మృతులను ఎమ్మెల్యే చెల్లెలు రాధిక, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కూతురు సహస్రలుగా గుర్తించారు. 20 రోజుల తర్వాత కారు బయటకు వచ్చింది. జనవరి 27 నుంచి రాధిక కుటుంబం కనిపించడం లేదు. కారు నంబర్ AP15 BN 3438 ఆధారంగా మృతులను గుర్తించారు పోలీసులు.

ఇవాళ(ఫిబ్రవరి 17,2020) కాల్వలో నుంచి కారుని వెలికితీశారు. 20 రోజులుగా రాధిక కుటుంబం కనిపించకుండా పోయినా.. ఇంతవరకు పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. అసలేం జరిగింది.. ఇది ప్రమాదమా? లేక కుట్ర కోణమా? అనేది మిస్టరీగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు జరుపుతున్నారు. ఎమ్మెల్యే బంధువులు 20 రోజులుగా కనిపించకుండా పోయినా పోలీసులకు ఫిర్యాదు అందకపోవడం చర్చనీయాంశంగా మారింది.

* కరీంనగర్ జిల్లా అలగనూరు కెనాల్ లో కారు
* కారులో మూడు మృతదేహాలు
* అలగనూరు కెనాల్ లో శవాలుగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం
* ఎమ్మెల్యే చెల్లి రాధిక, బావ సత్యనారాయణ రెడ్డి, కూతురు సహస్రగా గుర్తింపు
* జనవరి 27న కారులో బయటకు వెళ్లిన రాధిక కుటుంబం
* 20 రోజుల తర్వాత కెనాల్ లో కనిపించిన కారు

* ప్రమాదమా? కుట్ర కోణమా?
* పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు
* కారు నెంబర్ AP15 BN 3438 ఆధారంగా మృతులు గుర్తింపు
* సత్యనారాయణ రెడ్డి పేరు మీద కారు రిజిస్ట్రర్
* ఎమ్మెల్యే సోదరి కుటుంబం మిస్సింగ్ పై ఎన్నో అనుమానాలు
* 20 రోజుల క్రితం మిస్సైనా ఎమ్మెల్యే, పోలీసులు ఎందుకు బయటకు రాలేదు?

* పోలీసులకు ఎమ్మెల్యే ఎందుకు ఫిర్యాదు చేయలేదు
* చెల్లెలి కుటుంబంలో ఎలాంటి గొడవలు, ఆర్థిక ఇబ్బందులు లేవన్న ఎమ్మెల్యే దాసరి
* సోదరి కుటుంబం తరుచూ విహారయాత్రలకు వెళ్తుందన్న ఎమ్మెల్యే

Read More>> నూకలు రాసిపెట్టి ఉన్నాయ్..వెంట్రుక వాసిలో బతికిపోయారు