Shadnagar Mystery Death Case : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దారుణం.. షాద్‌నగర్ మిస్టరీ డెత్ కేసు ఛేదించిన పోలీసులు
షాద్ నగర్ లో డెత్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం భిక్షపతిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు నిర్ధారించారు పోలీసులు. ఈ హత్య కేసులో హెడ్ కానిస్టేబుల్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు.

Shadnagar Mystery Death Case : షాద్ నగర్ లో డెత్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం భిక్షపతిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు నిర్ధారించారు పోలీసులు. ఈ హత్య కేసులో హెడ్ కానిస్టేబుల్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు.
తన బినామీ అయిన భిక్షపతి పేరు మీద రూ.52లక్షల విలువైన ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించాడు శ్రీకాంత్. ఇల్లు కోసం భిక్షపతికి రూ.50లక్షల లోన్ ఇప్పించాడు. నామినీగా తన పేరు పెట్టుకున్నాడు శ్రీకాంత్. అయితే, డబ్బు అవసరం పడి భిక్షపతి పేరు మీదున్న ఇంటిని అమ్మేయాలనుకున్నాడు శ్రీకాంత్. ఇందుకు భిక్షపతి ఒప్పుకోలేదు. దీంతో భిక్షపతిని చంపేస్తే లోన్ ఇన్సూరెన్స్ వస్తుందని భావించాడు శ్రీకాంత్.
భిక్షపతిని ఎలా చంపాలన్న విషయమైన ఎస్వోటీలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మోతీలాల్ ను సంప్రదించాడు శ్రీకాంత్. మరో ఇద్దరు నిందితులతో కలిసి 2021 డిసెంబర్ 22న భిక్షపతికి మద్యం తాగించి మర్డర్ చేశారు. మొగిలిగిద్ద దగ్గర భిక్షపతిని కారు దిగమని చెప్పి మొదట హాకీ స్టిక్ తో కొట్టారు. తర్వాత కారుతో ఢీకొట్టి చంపేశారు.
అనంతరం భిక్షపతి పేరు మీదున్న ఇన్సూరెన్స్ డబ్బు కోసం దరఖాస్తు చేశాడు శ్రీకాంత్. భిక్షపతికి, శ్రీకాంత్ కు బంధుత్వం లేకపోవడంతో అనుమానించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో హత్యగా తేల్చారు. ఒకవేళ ఇన్సూరెన్స్ డబ్బులు శాంక్షన్ అయితే ముగ్గురు నిందితులకు రూ.10లక్షలు చొప్పున ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు శ్రీకాంత్. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కేసుని ఛేదించిన పోలీసులు.. నిందితులను జైలుకి పంపారు.