Gowlidoddi College : గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థి సూసైడ్‌లో కొత్త కోణాలు

హైదరాబాద్‌ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి వంశీ కృష్ణ(16) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వంశీ కృష్ణ సూసైడ్ లో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.

Gowlidoddi College : గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థి సూసైడ్‌లో కొత్త కోణాలు

Suicide

Gowlidoddi College : హైదరాబాద్‌ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి వంశీ కృష్ణ(16) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వంశీ కృష్ణ సూసైడ్ లో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్న వంశీ కృష్ణ రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. ఈ కాలేజ్ లో నేను లైంగికంగా వేధింపబడ్డా. ఆ మనోవేదనతోనే ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ సూసైడ్ నోట్ లో రాశాడు వంశీ. కాగా, సూసైడ్ నోట్ బయటకి రాకుండా బలవంతంగా ఫోటోలు డిలీట్ చేయించారని పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారగొండ గ్రామానికి చెందిన లింగారం లక్ష్మయ్య-సువర్ణ దంపతుల రెండో కుమారుడు వంశీకృష్ణ హైదరాబాద్ గౌలిదొడ్డి సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో బైపీసీ (ఫస్టియర్) చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు హాస్టల్‌లో తోటి విద్యార్థులతో కలిసి చదువుకున్నాడు. తర్వాత నిద్రపోయాడు. అనంతరం క్లాస్ రూమ్ లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Hyderabad : పందెంలో డబ్బు పోగొట్టుకున్నాడు.. తర్వాత భార్య అదృశ్యమైంది?

ఉదయం విద్యార్థులకు డ్రిల్ నిర్వహించారు. అయితే, ఈ డ్రిల్ కు వంశీ రాలేదు. దీంతో కాలేజీ సిబ్బంది, తోటి విద్యార్థులు అతడి కోసం వెతికారు. ఈ క్రమంలో ఓ గది తలుపులు మూసి ఉండటాన్ని గమనించారు. ఆ గది లోపల నుంచి లాక్ వేసి ఉండటంతో అనుమానం వచ్చింది. తలుపులు తోసుకుని లోపలికెళ్లి చూడగా షాక్ అయ్యారు. వంశీకృష్ణ ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు.

దీనిపై సమాచారం అందుకున్న ప్రిన్సిపాల్‌ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని కిందకి దించారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి బ్యాగ్ లో పోలీసులకు రెండు ఆత్మహత్య లేఖలు లభించాయి. ఒకటి తెలుగులో ఉంది. అందులో.. ‘నేను లైంగికంగా వేధించబడ్డా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని, ఆంగ్లంలో రాసిన మరో లేఖలో ‘బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నా’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు.

Murder For Omelette : షాకింగ్.. ఆమ్లెట్ వేయలేదని భార్యను చంపిన భర్త

వంశీ కృష్ణ ఆత్మహత్య ఘటన కాలేజీలో కలకలం రేపింది. తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అసలు వంశీ కృష్ణ మృతికి కారణం ఏంటి? కారకులు ఎవరు? అనేది మిస్టరీగా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. వంశీ కృష్ణ మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దీనిపై సమగ్రంగా విచారణ చేయాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పోలీసులను కోరారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. ఈ కేసులో మిస్టరీని చేధించే పనిలో పడ్డారు.