TSPSC Paper Leak : టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో తొమ్మిది మంది అరెస్టు

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ వ్యవహారంలో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్ పీఎస్ సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ సహా 9 మందిని అరెస్టు చేశారు.

TSPSC Paper Leak : టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో తొమ్మిది మంది అరెస్టు

TSPSC paper

TSPSC Paper Leak : టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ వ్యవహారంలో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్ పీఎస్ సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ సహా 9 మందిని అరెస్టు చేశారు. పేపర్ లీకేజీ సూత్రధారులు రేణుక, ఆమె భర్త, సోదరుడు, బంధువు అరెస్టు చేశారు. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన ముగ్గురు అభ్యర్థులు, ఇద్దరు దళారులు అరెస్టు చేశారు. ఈ మేరకు సౌత్ వెస్ట్ డీసీపీ కిరణ్ కరే వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 5న అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ లీక్ అయినట్లుగా తెలిపారు.

మార్చి11 అసిస్టెంట్ కమిషనర్ tspsc నుంచి కంప్లైంట్ వచ్చిందన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందని అని కంప్లైంట్ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రవీణ్ ప్రధాన నిందితుడు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని తెలిపారు. రేణుక అనే మహిళ ప్రవీణ్ కి పేపర్ లీక్ కి రూ.5 లక్షలు ఇచ్చారని పేర్కొన్నారు. మార్చి 2వ తేదీన పేపర్ లీక్ చేసి పెన్ డ్రైవ్ లో రేణుక, ఆమె భర్త కి ఇచ్చారని తెలిపారు.

TSPSC Paper Leak : టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ లో వెలుగులోకి సంచలన విషయాలు

లీక్ అయిన పేపర్ చేతికి వచ్చాకా మార్చి 5వ తేదీన AE ఎగ్జామ్ రాశారని చెప్పారు. ఇలా విడతల వారీగా రూ.13.5 లక్షలు చేతులు మరాయని పేర్కొన్నారు. Fsl రిపోర్ట్ వస్తేనే ae పేపర్ తో పాటు టౌన్ ప్లానింగ్ మిగతావి లీక్ అయ్యయా లేదా అనేది విచారణలో తేలాలన్నారు. టీఎస్ పీఎస్ సీ వారు ఇచ్చిన కంప్లైంట్ లో వేరే పేపర్ లు కూడా లీక్ అయి ఉండవచ్చు అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు.

2017 నుంచి ప్రవీణ్ అక్కడ పని చేస్తున్నారని తెలిపారు. రాజ శేఖర్ కి కంప్యూటర్ టెక్నాలజీ మీద గ్రిప్ ఉన్న అతడు ప్రవీణ్ కు సహకరించాడు కాబట్టి అతను హాక్ చేశారని వెల్లడించారు. డీఆర్డీఏలో రేణుక భర్త జాబ్ చేస్తున్నారని తెలిపారు. అరెస్ట్ అయినవారిలో కేతవత్ శ్రీనివాస్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారని పేర్కొన్నారు. శ్రీనివాస్ ని లీక్ పేపర్ కొనమని బేరం చేశారు.. కానీ శ్రీనివాస్ తనకి వద్దని అన్నాడని తెలిపారు. కానీ, శ్రీనివాస్ ద్వారా గోపాల్, నీలేష్ పేపర్ కొనుగోలు చేశారని తెలిపారు.