Uttar Pradesh: దళితుడిపై దాడి.. కెమెరాలో రికార్డైన ఘటన.. నిందితుడి అరెస్ట్

దళిత యువకుడిపై చెప్పుతో దాడి చేశాడో వ్యక్తి. మరో వ్యక్తి దీనికి సహకరించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ పరిధిలో ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Uttar Pradesh: దళితుడిపై దాడి.. కెమెరాలో రికార్డైన ఘటన.. నిందితుడి అరెస్ట్

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. దళితుడిపై చెప్పుతో దాడి చేశాడో వ్యక్తి. మరొక వ్యక్తి దీనికి సహకరించాడు. ఈ ఘటనను అక్కడున్న వారెవరో వీడియో తీయగా అది వైరల్‌గా మారింది. ఉత్తర ప్రదేశ్, ముజఫర్ నగర్ పరిధిలో ఇటీవల ఈ ఘటన జరిగింది.

iPhone: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే కొద్ది రోజులు ఆగండి.. ఎందుకంటే..

తాజ్‌పూర్ (రేతా నగ్లా) గ్రామానికి చెందిన ఊరి పెద్దలైన శక్తి మోహన్ గుర్జార్, గాజే సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు దినేష్ కుమార్ అనే దళిత యువకుడిని పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా అతడిపై దాడి చేసి, చెప్పుతో కొట్టారు. తర్వాత అతడిని చంపుతామని బెదిరించారు. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీశారు. తర్వాత అది వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అక్కడి దళిత సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ నిందితులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Woman abuses: గేటు తీయడం ఆలస్యమైందని సెక్యూరిటీ గార్డుపై మహిళ దాడి.. పోలీస్ కేసు నమోదు

నిందితులు ఇద్దరిలో శక్తి మోహన్‌ను అరెస్టు చేయగా, మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.