Pune : పాస్‌పోర్ట్ చింపి జైలు పాలైన వ్యక్తి.. ఎందుకో తెలుసా

అక్రమ సంబంధం విషయం దాచి పెట్టబోయి జైలు  పాలైన వ్యక్తి ఉదంతం పూణేలో చోటు చేసుకుంది.

Pune : పాస్‌పోర్ట్ చింపి జైలు పాలైన వ్యక్తి.. ఎందుకో తెలుసా

Pune Man Arrest

Pune :  అక్రమ సంబంధం విషయం దాచి పెట్టబోయి జైలు  పాలైన వ్యక్తి ఉదంతం పూణేలో చోటు చేసుకుంది. విదేశీ పర్యటన ముగించుకుని ఇండియాకు తిరిగి  వచ్చిన వ్యక్తిని ఎయిర్ పోర్టులో అధికారులు అరెస్ట్ చేశారు.  ఊహించని ఈ ఘటనతో ఆవ్యక్తి షాక్‌కు గురై కన్నీటి పర్యంతం అయ్యాడు.  జీవితంలో పెళ్లైన అనేక మంది వివాహేతర సంబంధాలకు వెంపర్లాడుతూ ఉంటారు. లేదా పెళ్లికి ముందు నడిచిన అనేక ఎఫైర్స్ ఎవరికీ తెలియకుండా వాటిని మేనేజ్ చేస్తుంటారు. వీటికి హాస్యాను జోడించి అనేక సినిమాలు కూడా వచ్చాయి.

పూణేకు చెందిన ఒక వ్యక్తి  (32) ఇటీవల తన భార్యకు తెలియకుండా  విదేశాలకు వెళ్ళాడు. అక్కడ తన ప్రియురాలితో గడిపి మళ్లీ గురువారం జులై 7వ తేదీ పూణే తిరిగి వచ్చాడు. ఎయిర్ పోర్టులో అతని పాస్ పోర్టు చెక్ చేసిన అధికారులు అందులో కొన్నిపేజీలు చింపి ఉండటం గమనించి అతడిని అరెస్ట్ చేశారు. పాస్ పోర్టులోని 3 నుంచి 6వ పేజీ వరకు….31 నుంచి 34వ  పేజీ వరకు అందులో లేవు. వాటిని చింపినట్లు అధికారులు  గుర్తించి అరెస్ట్ చేశారు. వాటిలో పేజీలు వాటంతటే అవే ఊడిపోయాయని అబధ్దం చెప్పి  తప్పించు కోవాలని చూశాడు. అయినా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  ఊహించని ఈఘటనలో షాక్ కు గురైన వ్యక్తి కన్నీటి పర్యంత మయ్యాడు.

పని మీద వేరే రాష్ట్రానికి వెళుతున్నానని భార్యకు  అబధ్దం  చెప్పి ఆ వ్యక్తి విదేశాలకు  వెళ్లి తన ప్రియురాలిని కలిసి వచ్చాడు. భర్త ప్రవర్తన మీద అనుమానం వచ్చిన భార్య.. అతను  ప్రియురాలి వద్ద ఉన్నసమయంలో భర్తకు పలుమార్లు ఫోన్ చేసింది. ఆ ఫోన్లకు అతడు సమాధానం చెప్పలేదు. ఇంటికి వెళితే భార్యకు దొరికిపోతానని భయం వేసింది.

ఇండియాకు తిరిగివచ్చినప్పుడు పాస్‌పోర్ట్‌లో   విదేశాలకు వెళ్ళిన స్టాంపింగ్ ఉంటుంది… కనుక అది తెలియకుండా ఉండేందుకు అందుకు సంబంధించిన పేజీలను తొందరపడి పాస్ పోర్టు లోంచి చింపివేశాడు.  పాస్ పోర్టు లోని   పేజీలను చింపటం నేరంగా పలుదేశాలు  పరిగణిస్తాయి. దీంతో విమానాశ్రయం అధికారులు అతనిపై మోసం, ఫోర్జరీ తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. శుక్రవారం అతడిని కోర్టులో ప్రవేశ పెట్టగా  అతను ష్యూరిటీ బెయిల్ మీద విడుదలయ్యాడు.

Also Read : T. Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో విందు రాజకీయాలు