Drunk And Drive : డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మీ ఇంట్లో చెపుతారు..మీ బాస్ కూ చెపుతారు

రాచకొండ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఇద్దరు మందు బాబుల ఘనకార్యం గురించి వాళ్లు పని చేస్తున్న ఆఫీసుకు లేఖలు రాశారు. 

Drunk And Drive : డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మీ ఇంట్లో చెపుతారు..మీ బాస్ కూ చెపుతారు

Drunk and Drive

Updated On : December 27, 2021 / 11:20 AM IST

Drunk And Drive :  రోడ్డు   ప్రమాదాల  నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే.  మందుబాబులు మద్యం తాగి రోడ్డుపై వాహనాలను నడపకుండా కట్టడి చేసేందుకు పలు రకాల పధ్దతుల్లో జరిమానాలు, శిక్షలు విధిస్తున్నారు.  కొంత మందికి జైలు శిక్షలు కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి.

ఇటీవల మద్యం తాగి వాహనం నడిపిన వారి కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్ కు   పిలిపించి వారి ముందు మందు బాబులకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు ఇప్పుడు కొత్త పధ్ధతి మొదలెట్టారు.  రాచకొండ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఇద్దరు మందు బాబుల ఘనకార్యం గురించి వాళ్లు పని చేస్తున్న ఆఫీసుకు లేఖలు రాశారు.

భవిష్యత్తులో ఇలాంటివి  పునరావృతం కాకుండా రోడ్డు భద్రతపై ఉద్యోగులకు   అవగాహాన కల్పించాలని లేఖలో సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయామని తోటి ఉద్యోగుల్లో చులకన భావం వస్తే…అప్పటికైనా మారి మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాచకొండ పోలీసు స్టేషన్ పరిధిలో గత వారం రోజులు పరిధిలో 100 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 15 మంది మరణించారు.88 మందిగాయపడ్డారు.